Nagarjuna Akkineni ఈ హీరోయిన్ ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ స్టార్.. నాగార్జున ప్రశంసల వర్షం

చిన్నారి పెళ్లికూతురు, ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్‌, రాజయోగం ఫేమ్ సాయి రోన‌క్ జంట‌గా న‌టించిన చిత్రం పాప్ కార్న్. ఎంఎస్‌ చ‌ల‌ప‌తిరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10 తేదీన గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. జనవరి 4వ తేదీన ఈ మూవీ ట్రైల‌ర్ లీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టాలీవుడ్ మన్మథుడు సంద‌ర్భంగా..

స్పానిష్ భాషలో చిన్నారి పెళ్లికూతురు

స్పానిష్ భాషలో చిన్నారి పెళ్లికూతురు

నేను బ్రెజిల్‌లోని రియో ప్రాంతంలో ఉన్న స్టూడియోను చూడటానికి వెళ్లాను. అక్కడికి వెళ్తే స్పానిష్ భాషలో ఓ పోస్టర్ ఉంది. ఆ పోస్టర్‌పై అవికా గోర్ ఫోటో ఉంది. ఆ ఫోటో గురించి అడిగితే.. చిన్నారి పెళ్లికూతురు (బాలికా వధు) సీరియల్‌ను స్పానిష్ భాషలో రిలీజ్ చేశాం. ఇక్కడ భారీ హిట్టైన సీరియల్స్‌లో ఒకటి. ఇలాంటి బాల్య వివాహాలు ఇండియాలో ఉన్నాయని వారు చెప్పారని నాగార్జున తెలిపారు.

ప్యాన్ వరల్డ్ స్టార్ అంటూ

ప్యాన్ వరల్డ్ స్టార్ అంటూ

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో నటించిన అవికా గోర్‌పై బ్రెజిల్ వాళ్లు ప్రశంసలు కురిపించారు. ఆ సీరియల్‌ 28 దేశాల్లో ప్రసారం చేశారు. అలాంటి ఘనత, పాపులారిటీ ఉన్న నటి అవికా గోర్. ఆ అమ్మాయి ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ కాదు.. ప్యాన్ వరల్డ్ స్టార్. కజకిస్థాన్‌లో రెండు సినిమాలు చేసింది. అవికా గోర్ సాధించిన విజయాలు మామూలువి కాదు అని నాగార్జున అన్నారు.

ఉయ్యాల జంపాల సినిమాతో

ఉయ్యాల జంపాల సినిమాతో

అవికా గోర్‌తో పరిచయం చాలా పాతది. నేను మా టెలివిజన్ భాగస్వామిగా ఉన్నప్పుడు చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ను తెలుగు భాషలో ప్రసారం చేశాం. ఆ సీరియల్ తెలుగులో కూడా బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత రామ్మోహన్ రావుతో కలిసి ఉయ్యాల జంపాల సినిమాను అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించాం. ఆ సినిమా తర్వాత అవికా పెళ్లికూతురు అయింది. పాప్ కార్న్ సినిమాతో నిర్మాతగా మారింది అని నాగార్జున అన్నారు.

ఫిబ్రవరి 10న పాప్‌కార్న్ రిలీజ్

ఫిబ్రవరి 10న పాప్‌కార్న్ రిలీజ్

పాప్ కార్న్ సినిమా చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ.. నాగార్జున గారు మా పాప్ కార్న్ సినిమా ట్రైలర్‌ను విడుద‌ల చేయ‌టం నిజంగానే కిక్ ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 10న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. అంద‌రూ స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. చిత్ర ద‌ర్శ‌క‌ుడు ముర‌ళి గంధం మాట్లాడుతూ.. డైరెక్టర్‌గా తొలి చిత్రం. మా పాప్ కార్న్ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి టీమ్‌ను స‌పోర్ట్ చేసిన నాగార్జున‌ గారికి మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. అలాగే అవికా గోర్‌, సాయి రోన‌క్‌.. గారికి, నిర్మాతలకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్ అని అన్నారు.

పాప్‌కార్న్ మూవీలో ఎవరెవరు అంటే?

పాప్‌కార్న్ మూవీలో ఎవరెవరు అంటే?

న‌టీన‌టులు: అవికా గోర్‌, సాయి రోన‌క్ త‌దిత‌రులు
కాన్సెప్ట్, స్టోరి, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళి గంధం
స‌మ‌ర్ప‌ణ‌: ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు
నిర్మాత‌: భోగేంద్ర గుప్తా
కో ప్రొడ్యూస‌ర్స్‌: అవికా గోర్‌, ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, శేషు బాబు పెద్దింటి
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.ఎన్‌.బాల్ రెడ్డి
మ్యూజిక్: శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌
ఎడిట‌ర్‌: కె.ఎస్‌.ఆర్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: భాస్క‌ర్ ముదావ‌త్‌
కొరియోగ్ర‌ఫీ: అజ‌య్ సాయి
ఫ్యాష‌న్ డిజైన‌ర్‌: మ‌నోహ‌ర్ పంజా
పీఆర్వో: నాయుడు సురేంద్ర‌, ఫణి (బియాండ్ మీడియా)
పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్స్‌: నియో స్టూడియోస్‌
మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ
మ్యూజిక్‌, ఆదిత్య మ్యూజిక్‌
బ్యాన‌ర్స్‌: ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్
రిలీజ్ డేట్: 2023-02-10

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X