పవన్ కల్యాణ్, పునీత్ రాజ్ కుమార్ అరుదైన వ్యక్తులు.. ఒంటరిగానే సాధించారు.. నాగార్జున ఎమోషనల్
విలక్షణ నటుడు కార్తీ, రాశీఖన్నా, రజీషా విజయన్, లైలా నటించిన చిత్రం సర్దార్. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం, జార్జి సీ విలియమ్ సినిమాటోగ్రఫి అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 21న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కినేని నాగార్జున చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..

సర్దార్ గురించి నాగ్..
అందరికి నమస్కారం. తమ్ముడు కార్తీని చాలా ప్రేమతో ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. కార్తీతో ఊపిరి సినిమా చేశాను. అప్పటి నుంచి మా మధ్య అనుబంధం స్టార్ట్ అయింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేస్తున్నాం. ఈ సినిమా గురించి కార్తీతో మాట్లాడాను. చాలా బాగుందని కార్తీ చెప్పాడు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మ్యాజిక్ చేస్తుందనే ఫీలింగ్ కలిగింది అని నాగార్జున అన్నారు.

సూపర్ స్టార్ షాడో నుంచి బయటపడి..
తమిళంలో కార్తీ అన్నయ్య సూర్య సూపర్ స్టార్. ఒక సూపర్ స్టార్ అన్నగా ఉన్నప్పుడు.. ఆ సూపర్ స్టార్ ఇమేజ్, షాడో నుంచి బయటకు వచ్చి తన ప్రతిభను వ్యక్తిగతంగా ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. కార్తీ ఘనతను సాధించాడు. అటువంటి వారిలో అదురుగా ఇద్దరే ఇద్దరిని చూశాను. ఒకరు పవన్ కల్యాణ్.. రెండు పునీత్ రాజ్‌కుమార్ మాత్రమే అరుదుగా కనిపిస్తారు అని నాగార్జున అన్నారు.

కార్తీకే సాధ్యమైందంటూ
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్.. కర్ణాటకలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్, తమిళంలో సూర్య తమ్ముడు కార్తీకే సాధ్యమైంది. కార్తీ అలాంటి క్రేజ్ ఎలా సంపాదించాడంటే.. బోల్డ్ స్టోరీలు అటెంప్ట్ చేసి.. కొత్త రకమైన స్టోరీలు చేసి.. అన్నంత సూపర్ స్టార్ అయ్యాడు. అలా చేయడం అందరికి సాధ్యపడదు అని నాగార్జున అన్నాడు.

కార్తీని తెలుగు ప్రేక్షకులు వదులుకోరు..
కార్తీ మల్టీ టాలెంటెడ్. పాటలు కూడా పాడుతాడు. తెలుగులో ఒకే ఒక జీవితం సినిమాలో పాట కూడా పాడాడు. అలాగే తెలుగు కూడా మాట్లాడుతాడు. తెలుగు మాట్లాడే వ్యక్తులను మన ప్రేక్షకులు అంత ఈజీగా వదలుకోరు. ఇక్కడే పెట్టుకొంటాం. కార్తీని అందుకే అభిమానిస్తారు. ఈ సినిమాను కూడా అంతే అభిమానిస్తున్నారు అని నాగార్జున అన్నారు.

సర్దార్ దర్శకుడి గురించి
తెలుగులో అభిమన్యుడు సినిమాను తీసిన మిత్రన్ సర్దార్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. సర్దార్ సినిమాను కూడా బాగా తీశాడని అనుకొంటున్నాను. ఈ చిత్రం అక్టోబర్ 21న రిలీజ్ అవుతున్నది. తప్పుకుండా థియేటర్‌లో చూడండి అని నాగార్జున అన్నాడు.


Click it and Unblock the Notifications











