కోడలు పిల్లతో ఫుల్ హ్యాపీ... సమంత గురించి నాగ్ క్రేజీ ట్వీట్

Recommended Video

King Nagarjuna Tweets On His Daughter In Law, Samantha Akkineni || Filmibeat Telugu

టాలీవుడ్‌లో అక్కినేని నాగార్జునను మన్మథుడిగా మార్చేసిన చిత్రం మన్మథుడు. ఆ చిత్రంలో నాగ్‌ను దర్శకుడు విజయ్ భాస్కర్ మరింత అందంగా చూపించాడు. అప్పటి నుంచి నాగార్జున గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మన్మథుడు చిత్రం నాగ్ కెరీర్‌లో ఫీల్‌గుడ్ మూవీగా నిలిచిపోయింది. అలాంటి మూవీకి సీక్వెల్‌గా మన్మథుడు 2 ను తెరకెక్కిస్తున్నారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పోర్చుగల్‌లో భారీగా చిత్రీకరించారు. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్‌ను ముగించుకొని నాగ్‌తోపాటు చిత్ర యూనిట్ తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున ఆసక్తకరమైన ట్వీట్ చేశారు. అదేమిటంటే..

 స్టార్ హీరోయిన్లతో మన్మథుడు 2

స్టార్ హీరోయిన్లతో మన్మథుడు 2

మన్మథుడు 2లో రకుల్ ప్రీత్ సింగ్, సమంత అక్కినేని, కీర్తీ సురేష్ లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. సమంతపై కీలక సన్నివేశాలను పోర్చుగల్‌లో చిత్రీకరించారు. అలాగే కీర్తీ సురేష్ పాత్ర సినిమాలో కీలకమని చిత్ర యూనిట్ వెల్లడించింది. సమంత, కీర్తీ సురేష్ పాత్రలు అతిథిపాత్రలు అయినప్పటికీ.. సినిమాను డ్రైవ్ చేసే ఫోర్స్ ఉంటుందని చెబుతున్నారు.

కోడలు పిల్లతో షూటింగ్

కోడలు పిల్లతో షూటింగ్

సమంత అక్కినేని గురించి నాగార్జున ట్వీట్ చేస్తూ.. మన్మథుడు2 చిత్రంలో సమంత కీలక పాత్రలో నటిస్తున్నది. కోడలు పిల్లతో షూటింగ్ సరదాగా సాగిపోయింది. ఆమెతో చేసిన షూటింగ్ చాలా ఆనందంగా సాగిపోయింది. మన్మథుడు సెట్స్ అంతా ఫన్‌తో నిండిపోయింది. మన్మథుడు సెట్స్‌లోని సందడి ఫొటోలు త్వరలో షేర్ చేస్తాను అని నాగార్జున ట్వీట్ చేశారు.

మన్మథుడు 70 శాతం పూర్తి

మన్మథుడు 70 శాతం పూర్తి

మన్మథుడు సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు 70 శాతం షూటింగ్ పూర్తి అయినట్టు సమాచారం. పోర్చుగల్‌లో చేసిన షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజ్‌ ఎడిటింగ్ శరవేగంగా సాగుతున్నది. నాగార్జున స్వయంగా దగ్గరుండి అవుట్‌పుట్‌ను చెక్ చేసుకొన్నట్టు సమాచారం. సినిమా అవుట్‌పుట్‌పై చిత్ర యూనిట్ హ్యాపీగా ఉన్నట్టు వెల్లడిస్తున్నారు.

 ఆగస్టులో విడుదలకు రెడీ

ఆగస్టులో విడుదలకు రెడీ

మన్మథుడు 2 సినిమాను శరవేగంగా పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నది. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18, ఆనందీ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతున్నది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. బీ నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, నాజర్, వెన్నెల కిషోర్, రావు రమేష్, లక్ష్మీ, దేవదర్శిని, సమంత అక్కినేని, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X