నాగార్జున చాలా హింస చేస్తున్నాడు: నిత్యప్రియురాలు..!?
నాగార్జున సినిమాల్లో హింస ఎక్కువైపోతోంది". ఈ మాటలు అన్నది ఎవరో కాదు. నాగర్జున మెచ్చిన నిత్యప్రియురాలైన భార్యామణి అమల. సెంట్రల్ ఏనిమల్ వెల్ ఫేర్ బోర్డ్ లో మెంబర్ అయిన అమల నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'హింస అనేది మన జీవితంలో నిత్యకృత్యమైపోయింది. న్యూస్ పేపర్స్ లో, టి.వి ఛానల్స్ లో ప్రతి రోజూ, ప్రతి గంట దాని గురించే చెప్పిందే పదే పదే చెప్పి మనుషుల్లో హింసా ప్రవృత్తిని మరింత పెంచుతున్నారు. రేప్, హత్య, యాక్సిడెంట్..అన్ని వార్తలనూ హైలైట్ చేస్తున్నారు. సినిమాల్లో కూడా హింస బాగా చూపిస్తున్నారు. నాగార్జున సినిమాల్లో సైతం హింస బాగా పెరిగిపోయింది.
మనల్ని ఇంప్రెస్ చేసేది ఒక హింసేనా? ఇంకేమీ లేదా? ఇప్పడు మనుషుల్లో అలజడి, ఆందోళన, భయం..ఇవన్నీ బాగా పెరిగిపోవడానికి టీవిల్లోగానీ, సినిమాల్లో గాని చూపించే హింస ఒక కారణంగా నేను భావిస్తున్నాను. మనసు ప్రశాంతంగా వుండాలంటే ఈ రోజు నుంచే జంతువుల్ని ప్రేమిద్దాం మనస్పూర్తిగా వాటికి అందించే ప్రేమ ద్వారా మనకి ప్రశాంతత కలుగుతుంది. తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుంది" అన్నారు.


Click it and Unblock the Notifications











