నేడు నాగార్జున పెళ్లి రోజు... వైరల్ అవుతున్న అమల ఎమోషనల్ ట్వీట్!
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగార్జున, అమల వివాహం జరిగి నేటి (జూన్ 11, 2019)తో సరిగ్గా 27 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అమల తన ట్విట్టర్ అకౌంట్లో ఎమోషనల్‌గా స్పందించారు. తన భర్తతో కలిసి దిగిన అరుదైన రొమాంటిక్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
పెళ్లి రోజు సందర్భంగా అక్కినేని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు నాగార్జున-అమల దంపతులను విష్ చేస్తూ కామెంట్లతో ముంచెత్తారు. మీరు మాపై శుభాకాంక్షల వెల్లువ కురిపించడం చాలా సంతోషంగా ఉంది. నాగ్, నా తరఫున అందరికీ ధన్యవాదాలు' అని అమల ట్వీట్ చేశారు.
అలా ప్రేమలో పడ్డారు
తమ లవ్ స్టోరీ గురించి అమల గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘తెలుగులో 'కిరాయి దాదా' విడుదలయ్యాక నాగార్జునతో కలిసి ఐదు సినిమాల్లో నటించా. షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.'' అని తెలిపారు.

పెళ్లి తర్వాత అందుకే సినిమాలకు దూరం
మా అమ్మకు నేను తీసుకునే నిర్ణయాలపై చాలా నమ్మకం. నా ప్రేమ విషయం చెప్పగానే వెంటనే ఒప్పేసుకుంది. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లయ్యాక ఇంటి బాధ్యతల కోసం సినిమాలకు దూరం అవ్వాలన్న నా ఆలోచననీ అమ్మ మెచ్చుకుందని... అప్పట్లో ఓ సందర్భంలో అమల తెలిపారు.
స్నేహితుడికి థాంక్స్ చెప్పిన నాగార్జున
నాగార్జున-అమల పెళ్లి రోజు సందర్భంగా రామ్ ప్రసాద్ అనే వ్యక్తి శివ సినిమాలో ఈ దంపతులు కలిసి నటించిన ‘సరసాలు చాలు శ్రీవారు' పాటను షేర్ చేస్తూ పెళ్లి రోజు విషెస్ తెలిపారు. దీనిపై నాగ్ స్పందిస్తూ ‘నా ప్రియమైన స్నేహితుడికి ధన్యవాదాలు. మాపై ప్రేమ చూపిస్తున్న అందరికీ థాంక్స్' అంటూ కామెంట్ పెట్టారు.

హ్యాపీ లైఫ్
అమల కంటే ముందు నాగార్జున... రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లాడారు. అయితే పెళ్లయిన ఆరేళ్లకే వీరు విడిపోయారు. వీరి కుమారుడే నాగ చైతన్య. అమలతో పెళ్లి తర్వాత నాగార్జున 27 ఏళ్లుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీరి కుమారుడు అఖిల్ కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











