నేనున్నాననీ... నీకేం కాదని!(అమలను ఎత్తుకున్న నాగ్)
హైదరాబాద్: నేనున్నాననీ..నీకేం కాదని! అంటూ నాగార్జున ఓ సినిమాలో పాడిన పాట గుర్తుందా. తన ప్రియ సఖికోసం ఈ పాటందుకుంటాడు హీరో. తాజాగా రియల్ లైఫ్‌లో ఈ పాట అందరికీ గుర్తొచ్చేలా చేశాడు నాగ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో వేడుకకు భార్య అమలతో కలిసి హాజరైన నాగార్జున కార్యక్రమం అయిపోయిన తర్వాత అమల స్టేజీపై నుంచి దిగడానికి ఇబ్బంది పడుతుంటే ఎత్తుకుని కిందకు దించారు.
ఇదే కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ....నా భార్య అమ్మలా లేదు అక్కలా ఉంది. నాదృష్టిలో ఆమె ఇప్పటికీ ఏంజిల్‌లానే కనబడుతుందనేలా ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు తన ముద్దుల భార్యకు అందరి సమక్షంలో ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నాడు.
అమల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తోంది. పెళ్లయిన తర్వాత దాదాపు 20 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమల ఇన్నాళ్లకు మళ్లీ వెండితెరపై కనిపించనుంది. మళ్లీ అమల స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడంపై భర్తగా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున.


Click it and Unblock the Notifications












