ప్రభుత్వం పై పళ్ళు విరిచిన నాగార్జున...
'ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న వీడియో పైరసీని అరికట్టండి. ఎక్కడ పైరేటెడ్ సిడి కనబడ్డా కాలితో తొక్కి రగడ, రగడ చెయ్యండి. నా ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ పైరసీని ఆపే ప్రయత్నం చెయ్యాలి. ఇది నా ఒక్కడి సమస్య కాదు. అందరి సమస్య. ఈ విషయాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. మన సమస్య మాత్రం అలాగే వుంటోంది. 50, 60 పర్సెంట్ ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ తీసుకొని జేబుల్లో వేసుకుంటున్నారు తప్ప ప్రభుత్వం పైరసీని అరికట్టడంలో విఫలమైంది.
ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. పైరసీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను అంటూ నాగార్జున ప్రభుత్వం పై విరుచుకు పడుతూనే విజ్ఝప్తి చేశారు. కింగ్ నాగార్జున, అనుష్క హీరోహీరోయిన్లుగా శ్రీకామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై వీరుపోట్ల దర్శకత్వంలో డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న 'రగడ" ఆడియో ఆవిష్కరణ నవంబర్ 29న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. అక్కినేని నాగేశ్వర రావు 'రగడ" ఆడియోను ఆవిష్కరించి తొలి సిడిని నాగార్జునకు అందించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.


Click it and Unblock the Notifications











