టాలెంటెడ్ దర్శకుడితో మరో కొత్త సినిమాను స్టార్ట్ చేసిన నాగార్జున
ఆరు పదుల వయసు దాటినా కూడా ఒకే రకమైన స్టైల్ లో కనిపించే నటుడు కింగ్ నాగార్జున. నవ మన్మథుడు అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్న నాగార్జున తన ఫిట్నెస్ తో నేటితరం హీరోలకు ఒక చాలెంజ్ విసురుతున్నారనే చెప్పాలి. ఇక ఆయన వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. జయపజయలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న నాగార్జున నెక్స్ట్ ప్రయోగాత్మక సినిమాలతో రాబోతున్నాడు.
నెక్స్ట్ వైల్డ్ డాగ్ అనే సినిమాను రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. ఇక ఆ తరువాత సోగ్గాడే చిన్న నాయనా సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తాడేమో అనుకుంటే ఆ సినిమాను ఇప్పట్లో స్టార్ట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే అంతకంటే ముందే నాగార్జున మరో థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ టైప్ లో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. ఆ సినిమాను ఈ రోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయహరు.

గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన కొత్త కథపై నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్ట్ ను ఫీనిసష్ చేయాలని చూస్తున్నారు. ఆ సినిమాలో నాగార్జున ఒక RAW ఎజెంట్ గా నటించబోతున్నాడని సమాచారం. ఇక నాగార్జున మరో రెండు కథలను కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం. ఈ ఏడాది వైల్డ్ డాగ్ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు సినిమాను విడుదల చేయాలని నాగ్ ప్లాన్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











