ఆమె సమక్షంలో మళ్ళీ కలిసిన నాగ్-అనుష్క..!
గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న నాగార్జున, అనుష్కల జోడీ ఎట్టకేలకు కలిసిపోయారు. ఆదాయపు పన్ను శాఖవారు తనపై దాడిచేయటానికి కారణం నాగార్జునతో వున్న స్నేహమే అని భావించిన అనుష్క, అప్పట్నుంచీ నాగ్ తో స్నేహాం తగ్గించుకుంది. ఆ రోజు నుంచి ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఏ ఫంక్షన్ లోనూ కలసి హాజరు కాలేదు.
కాగా నిన్న ఆదివారం రాత్రి జరిగిన మాటీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ జంట కలసిపోయారు. అంతే కాదు ఈ ఇద్దరి మధ్య నాగార్జున సతీమణి అమల కూడా వన్నారు. అంతే కాదండోయ్ నాగార్జున కొడుకు నాగచైతన్యతో తన నిశ్చితార్థం జరిగినట్టుగా వార్తలు వచ్చిన తర్వాత అనుష్క పబ్లిక్ ఫంక్షన్ కు హాజరుకావడం కూడా తొలిసారియే. ఇక నాగ్, అనుష్క, అమల నవ్వులు చిందిస్తుండంగా మా టీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో క్లిక్ మన్న ఫోటోను చూడండి...


Click it and Unblock the Notifications











