twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేడీ..చిత్రం పేకాట పై కాదు..నా పాత్ర...నాగార్జున

    By Srikanya
    |

    నేను ఈ చిత్రంలో మోసాలు చేస్తూ..అనేక గెటప్ లు వేస్తూంటాను. ఇది ఓ ప్రత్యేకమైన నావెల్ క్యారక్టైజేషన్. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ప్రెష్ గా ఫీలవటం గ్యారెంటీ. అలాగే ఫైనల్ రషెష్ చూసాక నేనూ ఫ్రెష్ గా ఫీలయ్యాను.. నా ఇంటెన్షన్ ఏమిటంటే ప్రేక్షకుడుకి ఓ డిఫెరెంట్ లుక్ తో ఫ్రెష్ గా ఫీలయ్యేలా చేయాలని అంటూ నాగార్జున తన కేడీ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో గాంబ్లింగ్, కార్డ్స్ ఆడటం ఉంటాయి. కానీ అవి హీరోకి హాబీలే. అంతే తప్ప అదే కథ కాదు అని వివరణ ఇచ్చారు. ఈ లోగా మరో పాత్రికేయుడు క్యాసినో రాయల్ ఇనిస్పిరేషన్ తో ఈ చిత్రం చేస్తున్నారా అని అడగ్గా ఖండించారు. జేమ్స్ బాండ్ సినిమాను ఎలా చేయగలం అని నాగార్జున ఎదురు ప్రశ్నించారు. మరో సారి చెప్తున్నారు..గాంబ్లింగ్ అనేది కేడి చిత్రంలో ఓ అంశం మాత్రమే. అలాగే ఈ చిత్రం భిన్నమైన క్యారెక్టరైజేషన్ మాత్రమే కాక విభిన్నమైన స్క్రీన్ ప్లే ఉంటుందని వివరించారు. ఇక దర్శకుడు కిరణ్ గతంలో నా యువ సీరియల్ కు మాటలు అందించాడు. అతనిలో ప్రతిభ గమనించి ఈ అవకాశం ఇచ్చాము. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ భిన్నంగ్ వెళ్దామనుకున్నామన్నారు. అలాగే ఈ చిత్రంలో ఆస్కార్ విన్నింగ్ స్లమ్ డాగ్ మిలియనీర్ లో విలన్ గా చేసిన అంకుర్ విలన్ గా చేస్తున్నాడు. అతను దర్శకుడుకీ,హీరో నాగార్జునకీ ధాంక్స్ చెప్పుకున్నాడు. తానూ ఈ చిత్రంలో చంద్ర అనే పాత్ర చేస్తున్నానని..గుంటూరు నుంచి గోవా వెళ్లి చివరకు హైదరాబాద్ చేరుకునే పాత్ర అన్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X