నాగార్జున.... జీసస్ అవతారం?

By Bojja Kumar

హైదరాబాద్: అన్నమయ్యగా....శ్రీరామదాసుగా....షిరిడి సాయిగా.....భక్తిరస చిత్రాలతో అలరించిన కింగ్ నాగార్జున మరో భక్తిరస చిత్రం చేయడానికి సిద్దమవుతున్నాడు. అయితే ఆయన ఈ సారి చేయబోయే చిత్రం మాత్రం విభిన్నం. త్వరలో నాగార్జున ఏసు ప్రభువుగా వెండితెరపై దర్శనం ఇవ్వబోతున్నట్ల తెలుస్తోంది.

అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయిబాబా వంటి భక్తి చిత్రాలు నాగార్జున కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు. ఈ మూడు చిత్రాలకు దర్శకత్వం వహించింది రాఘవేంద్రరావే కావడం గమనార్హం. ఈ సారి నాగార్జునను జీసెస్ పాత్రలో చూపించడానికి రాఘవేంద్రరావు ప్లాన్ చేసుకుంటున్నాడని వినికిడి.

Nagarjuna as Jesus Christ New Movie

ఇప్పటికే రాఘవేంద్రరావు స్క్రిప్టు వర్కు కూడా పూర్తి చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు మాటను నాగార్జున కాదనే అవకాశం లేదని అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం నాగార్జున తన కొడుకు అఖిల్ తెరంగ్రేటం చేస్తున్న సినిమా పనులు దగ్గరుండి చేసుకుంటున్నారు. అఖిల్ తొలి సినిమా నిర్లక్ష్యం చేస్తే అతని కెరీర్ పై దెబ్బపడే అవకాశం ఉండటంతో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తూండగా, నాగార్జున-నితిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X