‘డమరుకం’లో నాగార్జున పాత్ర పేరు? క్యారక్టైరైజేషన్?

By Srikanya

హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' . ఈ నెల 19న విడుదల అవుతున్న ఈ చిత్రంలో నాగార్జున పాత్ర పేరు మల్లికార్జున. అందరూ మల్లి అని పిలుస్తుంటారు. 'హలో బ్రదర్'లోని మాస్ కేరెక్టర్‌లా ఫుల్ జోష్‌తో ఉంటుంది. డబ్బు కోసం ఏమైనా చేసే పాత్ర. అనుష్క పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక 'బొమ్మాళి' రవి చేసిన పాత్ర అయితే ఎక్స్‌లెంట్. తన హావభావాలు, డైలాగ్ డిక్షన్ చూస్తే 'మాయాబజార్'లో ఎస్వీఆర్‌గారు గుర్తుకొస్తారు.

'డమరుకం'లో నాగార్జన ఓకే చేయటాని అంతగా నచ్చిన అంశాలు ఏమిటి అంటే... ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు, ఫ్యామిలీస్‌కీ నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. మన పురాణాల్లోని రాక్షసులు, దేవతల కథలు మనం చిన్నప్పటినుంచీ వింటూనే ఉంటాం. వాటిని ఇప్పటి ట్రెండ్‌కు కనెక్ట్ చేస్తూ తెరపై ఆవిష్కరిస్తే కచ్చితంగా అందరూ థ్రిల్ ఫీలవుతారు. 'డమరుకం'లో ప్రతి ఫ్రేమూ, ఎపిసోడూ థ్రిల్‌గానే అనిపిస్తుంది.

'డమరుకం' ఫైనల్ అవుట్‌పుట్ చూశాక నాగార్జున తనకు కలిగిన అనుభూతి గురించి చెపుతూ....చేసినప్పుడు కన్నా, చూస్తుంటే చాలా థ్రిల్ అనిపించింది. గ్రాఫిక్స్ అద్భుతంగా చేశారు. అరె... ఇలాంటి సినిమా త్రీడీలో చేసుంటే ఇంకా బాగుండేదే అని అనిపించింది. 'మమ్మీ రిటర్న్స్'లాంటి హాలీవుడ్ చిత్రాల స్థాయిలో 'డమరుకం' వచ్చింది అన్నారు. 'సక్కుబాయ్ గరం చాయ్' పాట ఆఖరి నిమిషంలో పెట్టడానికి కారణం చెపుతూ...సినిమా అంతా చూశాక ఓ మంచి మాస్ సాంగ్ ఉంటే బావుంటుందనిపించింది. లక్ష్మీరాయ్‌తో చేయాలనుకున్నాం. డేట్స్ కుదర్లేదు. పాట విని చార్మి ఇంప్రెస్ అయ్యి తనే చేస్తానంది అని చెప్పుకొచ్చారు.

''నాకు వ్యక్తిగతంగా పౌరాణికాలు, సోషియో ఫాంటసీలు, అవతార్ లాంటి సినిమాలు చూడడమంటే ఇష్టం. అందుకే 'డమరుకం' చాలా ఇష్టపడి చేశా. ఈ సినిమాని వెండితెరపై చూస్తుంటే చాలా వండర్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకులకు ఇది ఓ కన్నుల పండుగే'' అని నాగార్జున చెప్పారు. డమరుకంలో చాలా విశేషాలు ఉన్నాయని, నిర్మాణ విలువలు కూడా ఓ హైలైట్ అని నాగార్జున ప్రత్యేకంగా పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీమేకర్స్ వెంకట్ నిర్మించిన 'డమరుకం' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X