twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునతో రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'శిరిడిసాయి' చిత్రంలో రామకృష్ణ పరమహంసగా నాగార్జున కనిపిస్తారు. అవకాశమొస్తే నాగార్జునతో రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రను సినిమాగా తీస్తాను '' అన్నారు 'శిరిడిసాయి' నిర్మాత మహేష్ రెడ్డి. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే చిత్రం 'శిరిడిసాయి' తాము అనుకున్నట్లుగానే విజయం సాధించిందని,ఈ చిత్రాన్ని హిందీతోపాటు తమిళ, మరాఠీ భాషల్లోకి అనువదించబోతున్నామని అన్నారు.

    మహేష్ రెడ్డి మాట్లాడుతూ...''బాబా తత్వాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే 'శిరిడిసాయి' తీశాం. మా లక్ష్యం నెరవేరడం ఎంతో ఆనందాన్నిచ్చింది. చిత్రాన్ని హిందీతోపాటు తమిళ, మరాఠీ భాషల్లోకి అనువదించబోతున్నాము. మరిన్ని జాగ్రత్తలు తీసుకొని చిత్రాన్ని అనువదించాలనుకొంటున్నాం. ఎలాంటి వాణిజ్యపరమైన ఆలోచనలు లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించాను. కానీ విడుదలకు ముందు రోజే... మేం పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చింది'' అని చెప్పారు.

    అలాగే ''మా సినిమాని చూసి కనీసం వెయ్యిమంది భక్తులు శిరిడికి వెళ్లి బాబాను దర్శించుకొన్నా చాలనుకొన్నాను. 'శిరిడిసాయి'తో ఆ లక్ష్యం నెరవేరడం ఎంతో తృప్తినిచ్చింది. ఇప్పటి వరకూ యాభై లక్షలమందికిపైగా చిత్రాన్ని చూశారు. చిత్ర ప్రారంభంలో వచ్చే అభిషేకం పాటతోనే ప్రేక్షకుల్ని కథలో లీనం చేశారు దర్శకులు కె.రాఘవేంద్రరావు. నాగార్జున సినీ జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది'' అన్నారు. 'శిరిడిసాయి'లో నాగార్జున బాబా పాత్ర పోషించిన సంగతి విదితమే.

    English summary
    Nagarjuna was seen as Ramakrishna Paramahamsa in 'Shirdi Sai' for a few minutes. Now Shirdi Sai producer Mahesh Reddy wants to make a film on Rama Krishna Paramahamsa life with Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X