షిర్డీ సాయి నాగార్జున కన్ఫర్మ్...పూర్తి డిటేల్స్
అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలతో చారిత్రిక పాత్రలకు కూడా నిండుతనం తెచ్చి నిలబెట్టిన నాగార్జున మరో చారిత్రక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన త్వరలో షిర్డీ సాయిబాబాగా కనిపించనున్నారు.ఎ ఎమ్ ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మే 5(ఈ రోజు)న ఈ చిత్రానికి సంభందించిన ఎనౌన్స్ మెంట్ రానుంది. ఇక ఈ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే రాఘవేంద్రరావు పర్మెనెంట్ రైటర్ జె.కె భారవి ఈచిత్రానికి రచన చేయటం లేదు. కొత్త రచయిత ఈ చిత్రంతో పరిచయం కానున్నారు. జె.కె.భారవి ప్రస్తుతం ఆదిశంకరాచార్య అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం నాగార్జున..ఢమురుకం చిత్రం షూటింగ్ లో ఉన్నారు.శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











