నాగార్జున, బి. జయ మూవీ డీటేల్స్
హైదరాబాద్ : కింగ్ నాగార్జున తొలిసారిగా ఒక మహిళా దర్శకురాలితో కలిసి పని చేయబోతున్నారు. ఇటీవల 'లవ్ లీ' వంటి కమర్షియల్ చిత్రాన్ని తీసి, హిట్ కొట్టిన బి.జయ దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం చేయనున్నారు. దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా ఓకే అయింది, ప్రస్తుతం స్క్రిప్టు వర్కు జరుగుతోంది. హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగాల్సి ఉంది. త్వరలో ఈ విషయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
''నేను చాలామంది దర్శకులతో పనిచేశాను కానీ, మహిళా దర్శకులతో చేయలేదు. మంచి కథతో వస్తే బి. జయ దర్శకత్వంలో సినిమా చేస్తా'' అంటూ.... ఆది, శాన్వి జంటగా బి.జయ దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మించిన 'లవ్‌లీ' వందరోజుల వేడుక నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే.
కమర్షియల్ పంథాలోనే నాగార్జునని వెరైటీ పాత్రలో చూపించడానికి దర్శకురాలు జయ కథను తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో అంటే ఏప్రిల్, మే నెలల్లో ఈ చిత్రం షూటింగు మొదలయ్యే అవకాశం వుంది. భారీ బడ్జెట్టుతో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రాన్ని జయ భర్త, సీనియర్ జర్నలిస్ట్ బి.ఏ.రాజు నిర్మిస్తారు. 2013 మార్చిలో ఈ చిత్రం సెట్స్ మీదనకు రానుంది. ఈ లోగా నాగార్జున 'లవ్ స్టోరీ', 'భాయ్' చిత్రాలను పూర్తి చేయనున్నారు.
ప్రస్తుతం నాగార్జున దశరత్ దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో నాగార్జున సరసన నయనతార నటిస్తోంది. ఈచిత్రం తర్వాత 'భాయ్' అనే చిత్రంలో నాగార్జున నటించనున్నారు. నాగార్జున నటించిన భారీ గ్రాఫికల్ సోషియో ఫాంటసీ మూవీ 'డమరుకం' ఈ నెల చివర్లోగానీ, నవంబర్లోగానీ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











