‘నరనారాయణ’: కృష్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా నాగార్జున...?

By Bojja Kumar

Recommended Video

కృష్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా నాగార్జున...?

బాలకృష్ణ, నాగార్జున మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయం పక్కన పెడితే ఈ ఇద్దరి కాంబినేషన్లో పౌరాణిక సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త ప్రచారంలోకి రావడం అభిమానుల్లో ఆసక్తిరేపింది. బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్లో ఓ పౌరాణిక చిత్రం చేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. తాజా ఈ ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో మళ్లీ హాట్ టాపిక్ అయింది.

 పౌరాణిక చిత్రం ‘నరనారాయణ'

పౌరాణిక చిత్రం ‘నరనారాయణ'

బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్లో 'నరనారాయణ' అనే పౌరాణిక చిత్రం చేసేందుకు నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారు.

 స్క్రిప్టు సిద్ధమైందన్న నవావధాని మీగడ రామలింగస్వామి

స్క్రిప్టు సిద్ధమైందన్న నవావధాని మీగడ రామలింగస్వామి

నవావధాని మీగడ రామలింగస్వామి ‘నరనారాయణ' సినిమా కోసం స్కిప్టు సిద్ధం చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.... నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య కోరికపై నాగార్జున, బాలకృష్ణ కోసం ఈ స్క్రిప్టు రాశానని, ఇద్దరి సంభాషణల కోసం ఎన్నో సమాసాలను వాడామని, ఇటీవలే అది పూర్తయిందని తెలిపారు.

 బాలయ్యకు కథ వివరించాం

బాలయ్యకు కథ వివరించాం

ఇటీవలే ఈ ప్రాజెక్టును బాలయ్యకు వివరించానని రామలింగస్వామి తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వస్తుందని ఆయన వెల్లడించారు.

 ఈ ప్రాజెక్టు తెరపైకి ఎప్పుడు వస్తుందో?

ఈ ప్రాజెక్టు తెరపైకి ఎప్పుడు వస్తుందో?

అయితే ‘నరనారాయణ' సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుంది? అనే విషయంమై సరైన సమాచారం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాగార్జున-బాలకృష్ణ కాంబినేషన్ సాధ్యమేనా? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కొంతకాలంగా ఈ ఇద్దరు అగ్రహీరోల మధ్య రిలేషన్ సరిగా లేదని టాక్.

 బాలయ్య, నాగార్జున మధ్య విబేధాలు?

బాలయ్య, నాగార్జున మధ్య విబేధాలు?

నాగార్జున, బాలకృష్ణ మధ్య విబేధాలు ఉన్నట్లు చాలా కాలంగా ఇండస్ట్రీలో ఓ రూమర్ ఉంది. ఇటీవల నాగ చైతన్య వెడ్డింగ్ రిసెప్షన్ కు కూడా బాలయ్య రాక పోవడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.

 కలిసి నటించాలని కోరుకుంటున్న ఫ్యాన్స్

కలిసి నటించాలని కోరుకుంటున్న ఫ్యాన్స్

మొదటి నుండి నాగార్జున, బాలకృష్ణ మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఆ మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనలే వీరి మధ్య దూరం పెంచిందని వినికిడి. అయితే అభిమానులు మాత్రం ఇద్దరూ కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ‘నర నారాయణ' ప్రాజెక్టుతో అభిమానుల కోరిక తీరాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X