»   » బాలయ్యతో ఎలాంటి విబేధాలు లేవు: నాగార్జున

బాలయ్యతో ఎలాంటి విబేధాలు లేవు: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్యతో ఎలాంటి విబేధాలు లేవని, తమ మధ్య స్నేహం అప్పటికీ, ఇప్పటికీ అలానే ఉందని నాగార్జున స్పష్టం చేసారు. ఇద్దరి మధ్య మాటలు లేవని, ఒకరంటే ఒకరికి పడటం లేదని కొంత కాలంగా రూమర్స్ వస్తున్న నేపథ్యంలో నాగార్జున ఈ కామెంట్స్ చేసారు.

విశాఖలో శనివారం టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్ నిర్వ‌హించిన జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో నాగార్జున, బాల‌య్య కలిసారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరు స్టార్స్ కలవడం చూసి అభిమానులు ఆనంద పడుతున్నారు.

Nagarjuna, Balakrishna Together at TSR Awards

టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ సినీ అవార్డుల కార్యక్రమం శనివారం రాత్రి విశాఖపట్నంలో వైభవంగా జరిగింది. ఓవైపు ఆట పాటలు, మరోవైపు అవార్డుల హంగామాతో ఆద్యంతం ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో తెలుగు సినీ తారలు, బాలీవుడ్‌ ప్రముఖులు తళుక్కుమన్నారు.

2016 సంవత్సరానికి గాను ఉత్తమ కథానాయకుడుగా నందమూరి బాలకృష్ణ (డిక్టేటర్‌) 2), ఉత్తమ నటుడు- అక్కినేని నాగార్జున (సోగ్గాడే చిన్నినాయనా) అవార్డులు అందుకున్నారు.

English summary
Nagarjuna Balakrishna Together at TSR Awards , TSR TV9 Awards event is held satureday at Visakhapatnam and this event is embraced by so many celebrities like Krishnam Raju, Jaya Prada and stars like Mega Star Chiranjeevi, Balakrishna, Nagarjuna and so on.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu