'జోష్'లో నాగ్, బాలయ్య, వెంకీ?
నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమౌతున్న చిత్రం 'జోష్'. ఒకప్పటి ప్రముఖ నాయిక రాధ కుమార్తె కార్తిక కథానాయికగా పరిచయమౌతోంది. 'దిల్'రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి సంభందించిన ఓ తాజా వార్త అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రముఖ కథానాయకులు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు తలుక్కున మెరవనున్నారు. వీరంతా ఈ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ గా కనిపిస్తారని సమాచారం. ఇంకా అక్కినేని నాగేశ్వర రావు, డి.రామానాయుడు కూడా ఈ జాబితాలో వున్నట్టు సమాచారం.
ఇప్పటికే కావలసినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రానికి ఈ అప్పీరియన్స్ మరింత క్రేజ్ ను ఇస్తుందనడంలో సందేహం లేదు.
More from Filmibeat
josh naga chaitanya nagarjuna balakrishna venkatesh karthika radha dil raju vasu avrma జోష్ నాగచైతన్య నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ అక్కినేని నాగేశ్వర రావు డిరామానాయుడు కార్తిక దిల్ర


Click it and Unblock the Notifications











