twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంగార్రాజు సినిమా యూనిట్ కు భారీ షాక్.. అసలే ఇబ్బందులో ఉంటే మరో ఇబ్బంది.. హెచ్డీ ప్రింట్ తో సినిమా లీక్!

    |

    టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ బంగార్రాజు ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా 14వ తేదీన విడుదలైంది. ఇప్పటికే ఏపీలో టికెట్ రేట్ల విషయంలో ఇబ్బంది పడుతున్న యూనిట్ కి మరో షాక్ తగిలింది. ఆ వివరాల్లోకి వెళితే

    రిలీజ్ ఉండదనుకున్నారు కానీ

    రిలీజ్ ఉండదనుకున్నారు కానీ

    అక్కినేని, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి టార్గెట్ గానే ప్రారంభమైనా చివరికి సంక్రాంతికి రాదనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి ఇదే పెద్ద సినిమాగా పండుగ బరిలోకి దిగింది. సంక్రాంతి 2022 బరిలో RRR, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కి సిద్ధమైన నేపథ్యంలో బంగార్రాజు బాక్సాఫీస్ బరిలో ఉండకపోవచ్చని సంకేతాలు వచ్చాయి.

    టెన్షన్ క్లియర్

    టెన్షన్ క్లియర్

    అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పరిస్థితులు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో RRR, రాధేశ్యామ్ పోటీ నుంచి వెనుకంజ వేయడంతో బంగార్రాజు కు లైన్ క్లియర్ అయినట్లు అయింది. అయితే ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయని అనుకుంటే దానికి తగ్గట్టే మేము బడ్జెట్ వేసుకున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు కానీ నైజాం కంటే పెద్ద మార్కెట్ అయిన ఏపీ విషయంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ముందు ప్రకటించిన విధంగా కాకుండా ఏపీలో కర్ఫ్యూ కూడా ఎత్తివేయడంతో సినిమాకు ఒక రకంగా కొంత టెన్షన్ క్లియర్ అయింది.

    సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ గా

    సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ గా

    సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు సత్యానంద్‌ కదా అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు, బంగార్రాజు 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఇందులో అక్కినేని నాగార్జున మరియు రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటించారు, ఇక నాగ చైతన్య మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు.

    యూనిట్ కు షాకింగ్ న్యూస్

    యూనిట్ కు షాకింగ్ న్యూస్

    ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. నాగ చైతన్య నటనను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు మరియు పంచెకట్టు వేషధారణలో తండ్రీ కొడుకులు ఇద్దరినీ చూసి అక్కినేని అభిమానులు ఉప్పొంగి పోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు సినిమా యూనిట్ కు షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.

    హెచ్డీ క్వాలిటీతో సినిమా లీక్

    హెచ్డీ క్వాలిటీతో సినిమా లీక్

    అదేంటంటే పెద్ద సినిమా విడుదలైనప్పుడల్లా వీడియోగ్రాఫ్ చేసి ఆన్‌లైన్‌లో లీక్ చేసే దుర్మార్గులు పొంచి ఉన్నారని మనందరికీ తెలుసు. బంగార్రాజు విషయంలోనూ అదే జరిగింది. మూవీరుల్జ్, తమిళ్‌రాకర్స్ వంటి టొరెంట్ సైట్‌లలో ఈ సినిమా లీక్ అయినట్లు తెలిసింది. హెచ్డీ క్వాలిటీతో సినిమా లీక్ అయిందని చెబుతున్నారు.

    పైరసీ చట్టవిరుద్ధం మరియు నేరం. అలా చేసినందుకు మీకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడవచ్చు. కాబట్టి, సినిమాలోని ఏ భాగాన్ని మీ మొబైల్‌లో రికార్డ్ చేసి సర్క్యులేట్ చేయకండి. బంగార్రాజు సినిమాను థియేటర్లలో మాత్రమే చూసి ఆనందించండి, పైరసీని ప్రోత్సహించకండి. సినిమా పైరసీ కాపీలు మీకు కనిపిస్తే, సైబర్‌సెల్‌కు రిపోర్ట్ చేయండి.

    English summary
    Nagarjuna's Bangarraju HD Print Leaked.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X