For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Multi Starrer Movies 2022లో సందడి చేసిన మల్టీ స్టారర్ చిత్రాలు.. ఎన్ని హిట్ అయ్యాయంటే?

  |

  సినీ లవర్స్ కు ఉన్న ఏకైక ఎంటర్టైన్ మెంట్ సినిమా. వరుసపెట్టి సినిమాలు విడుదలైన అలసిపోకుండా చూస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే వాళ్ల అభిమాన హీరో మూవీ ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇక తమ అభిమాన హీరోతోపాటు మరో స్టార్ హీరో ఉంటే.. ఇక వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. మూవీ లవర్స్ అనే కాకుండా సగటి ప్రేక్షకుడికు సైతం ఎంతో ఇష్టంగా చూసేందుకు ముందుకు వచ్చే చిత్రాలు మల్టీ స్టారర్స్. ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ పై కనిపిస్తే ఆ థియేటర్లలో విజిల్స్, అరుపులు, కేకలతో మారుమోగిపోతుంది. అలా ఈ 2022 సంవత్సరంలో సందడి చేసిన మల్టీ స్టారర్ సినిమాలపై ఓ లుక్కేద్దామా!

  బంగార్రాజు

  బంగార్రాజు

  2022 క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలోనే సందడి చేసిన సినిమా బంగార్రాజు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య కలిసి నటించిన ఈ చిత్రం సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా తెరకెక్కింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తోనే హిట్టు కొట్టింది. ఇందులో నాగార్జున రెండు పాత్రల్లో నటించారు. ఇక హీరోయిన్స్ గా రమ్యకృష్ణ, కృతిశెట్టి అలరించారు.

  RRR

  RRR

  దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం RRR చిత్రం. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజుకు సంబంధించిన కథను ఆధారంగా చేసుకొని కల్పితంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఇంకా ఇప్పటికీ పలు అవార్డులు సాధించే పనిలో ఉంది.

  భీమ్లా నాయక్

  భీమ్లా నాయక్

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమెక్ గా వచ్చిన ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్, ఆర్మీ నుంచి రిటైర్ అయి పొగరున్న వ్యక్తిగా రానా దగ్గుబాటి అలరించారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 25న విడదలైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

  ఆచార్య

  ఆచార్య

  తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో సత్యదేవ్ కూడా ఓ పాత్ర పోషించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా సందడి చేసిన ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోకపోవడమే కాకుండా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

  F3

  F3

  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నవ్వులు పూయించిన చిత్రం F2. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ గా మరింత ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమానే F3. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా అలరించారు. అలాగే స్పెషల్ సాంగ్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే సందడి చేసింది.

  గాడ్ ఫాదర్

  గాడ్ ఫాదర్

  మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత అలరించిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన మలాయళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమెక్ గా ఈ చిత్రం వచ్చింది. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాలో విలన్ గా సత్య దేవ్ అలరించగా.. చిరంజీవికి బాడీగార్డ్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించి ఈ సినిమా టాక్ పరంగా సక్సెస్ సాధించినప్పటికీ వసూళ్ల పరంగా అంతగా రాబట్టలేకపోయింది.

  ఓరి దేవుడా

  ఓరి దేవుడా

  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా అలరించిన చిత్రం ఓరి దేవుడా. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం ఓ మై కడవులే మూవీకి రీమెక్ వెర్షన్. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి టాక్ మాత్రం పాజిటివ్ గానే వచ్చింది. ఇదిలా ఉంటే విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ సినిమాలకు పెట్టింది పేరని తెలిసిన విషయమే. ఇదే కాకుండా ద్విభాషా చిత్రంగా వచ్చిన సీతారామంలో దుల్కర్ సల్మాన్, సుమంత్ కలిసి నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఘన విజయం సాధించింది.

  English summary
  Best Telugu Multi Starrer Movies In 2022 And Chiranjeevi Ram Charan Jr NTR Pawan Kalyan Rana Daggubat Venkatesh Acted Together.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X