నాగార్జున ‘భాయ్’ మూవీ ప్రారంభం
తాజాగా ఈచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొడక్షన్ టీంతో పాటు, అక్కినేని అమల హాజరయ్యారు. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో మొదటలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా, కామెడీ ఎంటర్ టైనర్ గారూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
'భాయ్' చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుంది. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి ఇటీవల వెల్లడించారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి. ప్రస్తుతం నాగార్జున 'లవ్ స్టోరీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే డిసెంబర్లో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది.


Click it and Unblock the Notifications
