twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున కొత్త చిత్రం షూటింగ్ జనవరి 4 నుంచి...

    By Srikanya
    |

    హైదరాబాద్: నాగార్జున కొత్త చిత్రం 'భాయ్' చిత్రం జనవరి నాలుగు నుంచి షూటింగ్ మొదలవుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలోలీడర్, మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా చేస్తోంది. సోనూసూద్ మెయిన్ విలన్ గా కీ రోల్ లో కనిపించనున్నారు. నాగార్జున స్వయంగా తమ అన్నపూర్ణ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ జోగయ్య శాస్త్రి టైటిల్ సాంగ్ రాసారు. అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

    నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

    దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

    అలాగే నాగార్జున కూడా 'భాయ్' సబ్జెక్ట్ పట్ల చాలా సంతోషంగా వున్నారని, తన కెరీర్‌లో వైవిధ్యమైన హాస్య చిత్రం చేయబోతున్నానని ఆయన ప్రశంసించినట్లు వీరభవూదమ్ తెలిపారు. 'హాలో బ్రదర్' తరహాలో సినిమా వుంటుంది కానీ నాగార్జున ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం లేదని ఆయన అన్నారు. రిచాగంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్.

    English summary
    Nagarjuna’s ‘Bhai’ will begin shooting from January 4th. The film is going to be directed by Veerabhadram Chowdhary, who directed ‘Ahana Pellanta’ and ‘Poola Rangadu’ earlier. Richa Gangopadhyay is the heroine in the movie while Sonu Sood will be seen in a key role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X