మొన్న చరణ్, నిన్న విష్ణు, నేడు నాగార్జున!
ఈ చిత్రంలో హంసా నందిని స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఈ చిత్రంలోని ఓ పెళ్లి పాటలో హంసా నందిని కనిపించబోతోంది. ఈ విషయాన్ని ఆమె ఇటీవల మీడియాకు వెల్లడించారు. మరో వైపు బ్రెజిల్ భామ నథాలియా కౌర్ 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు. ఇటీవలే వీరిపై పాట చిత్రీకరణ జరిగింది.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ స్లోవేనియాలో ప్లాన్ చేసారు. రొటీన్ లొకేషన్లు కాకుండా కొత్త లొకేషన్ కావడంతో ఇక్కడ షూటింగ్ జరుపాలని నిర్ణయించారు. రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు ఇక్కడి కొత్త లొకేషన్లు పరిచయం అయ్యాయి. దీంతో హీరో విష్ణు 'దూసుకెత్తా' సినిమా యూనిట్ కూడా అక్కడకు షూటింగ్ నిమిత్తం వెళ్లింది.
ఇప్పుడు నాగార్జున 'భాయ్' మూవీ కూడా స్లోవినియాలో షూటింగ్ జరుపుకుంటోంది. 'భాయ్' చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి. ప్రస్తుతం నాగార్జున 'లవ్ స్టోరీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే డిసెంబర్లో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది.


Click it and Unblock the Notifications












