ఆప్ఘనిస్దాన్ లో నాగార్జున ఆస్తులు
నాగార్జునలో మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడనే విషయం మొదటి నుంచి తెలిసిందే. తొంబైల్లో నాగార్జున ఆప్ఘనిస్దాన్ లో ఓ స్దలం కొన్నారు. ఎప్పటికైనా అక్కడ ఫిల్మ్ స్టూడియో కట్టాలనేది ఆయన ఆలోచన. అయితే అక్కడ తాలిబన్ లు పెరిగిపోవటంతో రీసెంట్ గా దాన్ని అమ్మివేసారు. ఈ అమ్మకంతో నాగార్జున ఆస్తుల వివరాలు బయిటకు వచ్చింది.
ఇక నాగార్జునకి అంత దూరాన అదీ ఆప్ఖనిస్దాన్ లో భూములు కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది. అక్కడేమన్నా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్నాడా అంటే...నాగార్జున అప్పట్లో అంటే తొంబైల్లో ఖుదాగవా అనే సినిమా చేసారు. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి,నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం ఆప్ఘనిస్దాన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. అప్పుడు షూటింగ్ పూర్తిగా ఆప్ఘనిస్దాన్ లోనే జరిగింది.
అక్కడ ప్రదేశాలు చూసి ముచ్చటపడ్డ నాగార్జున వెంటనే అక్కడ స్ధలం కొన్నాడు. తర్వాత ఎప్పుడైనా అక్కడ ఫిల్మ్ స్టూడియో కట్టి మన వాళ్ల షూటింగ్ లుకు వినియోగపడేలా చేద్దామనే ఆలోచన చేసారు. అయితే దురదృష్టవశాత్తు ఆప్ఘనిస్దాన్ ..తాలీబన్ సామ్రాజ్యంగా మారిపోయింది. దాంతో అక్కడ వ్యాపారం చేయటం కష్టమనే నిర్ణయానికి నాగ్ వచ్చారు. వెంటనే ఆ స్ధలం మంచి లాభాలకు అమ్మేసారు.
ప్రస్తుతం నాగార్జున నటించిన ఢమరుకం చిత్రం విడుదలకు సిద్దమైంది. నాగార్జున ఈ సోషియో పాంఠసీ చిత్రంలో ఆటో డ్రైవర్ గా కనిపించనున్నారు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస రెడ్డి డైరక్ట్ చేస్తున్నారు. మరో ప్రక్క నాగార్జన..దశరధ్ దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే చిత్రం కమిటయ్యారు. నయనతార ఈ చిత్రంలో నాగార్జున సరసన చేస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని..నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











