కొడుకు కోసం నాగార్జున పాట్లు
సినిమా బాగుంటే చాలు మౌత్ టాక్ తో ప్రజలే పబ్లిసిటీ ఇస్తారు, కనకవర్షం కురిపిస్తారు. అసలు మౌత్ టాక్ ను మించిన పబ్లిసిటీ మరోటి వుండదు. కానీ సినిమా బాగోలేకపోతే మాత్రం నిర్మాత కష్టపడాలి. తన సినిమా చాలా బాగుందని వారితో వీరితో చెప్పించి రకరకాల పబ్లిసిటీ స్టంట్స్ తో సినిమాను నిలబెట్టుకోవాలని చూస్తారు. ఇందులో భాగమే ఇప్పుడు ఏర్పాటవుతున్న సక్సెస్ మీట్స్. ఈ మీటింగుల్లో సినిమా అదరగొడుతోందని చెప్పి చూసేవారి చెవిలో పూలు పెట్టాలని చూస్తారు. అసలు సినిమా సక్సెస్ అయితే ఈ మీటింగులు ఎందుకన్న విమర్శలూ వున్నాయి. తమ ఆనందాన్ని నేరుగా ప్రేక్షకులతో పంచుతొని కృతజ్ఞతలు చెప్పుకోవడానికేనని చెబుతున్నారు చిత్రవర్గాల వారు.
సినిమా బాగోలేదని టాక్ వస్తే చాలు రిలీజైన రెండో రోజో, మూడో రోజో సక్సెస్ మీట్ లు పెడుతున్నారు. కానీ నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' చిత్రం విజయోత్సవ సభను మాత్రం రిలీజ్ నాడే పెట్టడం గమనార్హం. ఎంతైనా నాగార్జున మంచి బిజినేస్ మ్యాన్ కదా, తన కొడుకు సినిమాను ప్రమోట్ చెయ్యడానికి మొదటి రోజు నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సక్సెస్ మీట్ కు నాగార్జున, హీరోహీరోయిన్లు నాగచైతన్య, కార్తిక, రాధ, జెడి చక్రవర్తి హాజరయ్యారు. ఈ సంధర్భంగా జెడి చక్రవర్తి మాట్లాడుతూ "ఈ సినిమా చూసిన 70 మంది సూపర్ హిట్ అని, 30 మంది అబౌ యావరేజ్ అంటున్నారని" చెప్పారు. బహుశా ఆ 70 మంది సినిమా యూనిట్ సభ్యులు కాబోలు!!!


Click it and Unblock the Notifications











