అంత సంపాదన లేదు, ఫోర్బ్స్ కథనంపై నాగ్ అసంతృప్తి

ఫోర్బ్స్ లిస్టులో నాగార్జున 61వ స్థానం దక్కించుకున్నారు. 2013 సంవత్సరంలో రూ. 20.5 కోట్లు సంపాదించినట్లు పేర్కొనబడి ఉంది. సంపాదన పరంగా ఆయన 34వ స్థానంలో, పాపులారిటీ పరంగా 75వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. అయితే తనకు అంత సంపాదన లేదని, ఊహా జనితంగానే ఆ లెక్కలు ప్రకటించారని అంటున్నారు నాగార్జున. ఈ మేరుకు ఫోర్బ్స్ ఎడిటర్‌కు ఈమెయిల్ పంపినట్లు ఆయన తెలిపారు.
ఈ పత్రిక ప్రటించి ఇతర తెలుగు సెలబ్రిటీల వివరాల్లోకి వెళితే...పవన్ కళ్యాణ్ కు ఈ లిస్టులో 26వ స్థానం దక్కింది. అతని సంపాదన రూ. 57 కోట్లుగా పేర్కొన్నారు. సంపాదన పరంగా పవన్ కళ్యాణ్ 13వ స్థానంలో ఉన్నారని, పాపులారిటీ పరంగా 79వ స్థానంలో ఉన్నారని పేర్కొంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ లిస్టులో 54వ స్థానం దక్కింది. ఆయన సంపాదన రూ. 28.96 కోట్లుగా పేర్కొన్నారు. సంపాదన పరంగా 24వ స్థానం, పాపులారిటీ పరంగా 84వ స్థానం దక్కించుకున్నాడు మహేష్ బాబు. ఇక రవితేజకు 68 స్థానం దక్కగా సంపాదన రూ. 13 కోట్లు ప్రకటించారు. సంపాదన పరంగా రవితేజ 54వ స్థానం, పాపులారిటీ పరంగా 73వ స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ 69వ స్థానం దక్కించుకోగా, సంపాదన 12.67 కోట్లు. సంపాదన పరంగా చరణ్ 55వ స్థానం, పాపులారిటీ పరంగా 72వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











