బిజేపీ 40 మంది జాబితాలో నాగార్జున పేరు!
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జున ఇప్పటికే బిజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. మెడీ దేశ ప్రధాని అయితే దేశం బాగు పడుతుందని, అభివృద్ధి చెందుతుందని నాగార్జున భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రంలో జరిగే ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ తరుపున ప్రచారం చేయబోతున్నారు.
ఎన్నికల్లో బిజీపీ తరుపున ప్రచారం చేసే ప్రముఖుల జాబితాను ఆ పార్టీ తాజాగా విడుదల చేసింది. 40 మందితో కూడిన ఈ లిస్టులో నాగార్జున పేరు కూడా చేర్చారు. వీరితో పాటు కోట శ్రీనివాసరావు, శరత్ బాబు, సురేష్, శివాజీ, జీవిత రాజశేఖర్, శివాజీ రాజా తదితరులు పేర్లు కూడా ఉన్నాయి.

రాజకీయాలు పక్కన పెడితే....
నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'మనం' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఇష్క్ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అక్కినేని మూడు తరాలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
కింగ్ నాగార్జున, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయమై అక్కినేని నాగార్జున తొలిసారిగా స్పందించారు. మణిరత్నం సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించబోతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











