»   » 30 ఇయర్స్ ఇండస్ట్రీ: కంగ్రాట్స్ అక్కినేని నాగార్జున!

30 ఇయర్స్ ఇండస్ట్రీ: కంగ్రాట్స్ అక్కినేని నాగార్జున!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్, క్లాస్ సినిమాలతో పాటు భక్తిరస చిత్రాలు సైతం చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాలు పూర్తయింది.

1986 లో వచ్చిన 'విక్రమ్' చిత్రంతో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన అక్కినేని నాగార్జున.. సరిగ్గా నేటితో తెలుగు చిత్ర పరిశ్రమలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా.. నాగార్జున ట్వీట్ చేస్తూ' మిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానుల 30 సంవత్సరాల ప్రేమతో మరో 30 సంవత్సరాలైన సిద్దం. అమ్మ, నాన్నలను ఎంతో మిస్ అవుతున్నా.. అందరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. నాగార్జున ప్రస్తుతం తన భార్య అమలతో కలిసి అమెరికా లో ఉన్నారు.

నాగార్జున సినీ ప్రస్థానం..
నాగార్జున మొదటి చిత్రం విక్రం, మే 23, 1986లో విడుదల అయింది. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది.

Nagarjuna Celebrates 30 Years in film industry

అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన గీతాంజలి నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. దీని తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం 'శివ' సెన్సేషన్ హిట్ కావడంతో నాగార్జున స్టార్ హీరోల లిస్టులో చేరిపోయారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది.

ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో వచ్చిన'నిన్నే పెళ్లాడుతా' నాగార్జునను ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి లాంటి భక్తిరస చిత్రాలు సైతం చేసి ప్రేక్షకులను మెప్పించిన ఘనత నాగార్జునకే దక్కింది. అన్నమయ్య చిత్రంలో నాగర్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడ అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఇవే కాకుండా మనం, ఊపిరి, కింగ్, మన్మధుడు లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. నాగార్జున ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కనున్న భక్తి చిత్రం 'ఓం నమో వెంకటేశ' లో ప్రస్తుతం నటిస్తున్నారు.

English summary
It’s party time in the Akkineni household. Yes! Nagarjuna who had made his onscreen debut in the Telugu film Vikram in 1986 is completing three decades of glorious stay in the film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu