నాగార్జున పాత్ర హైలెట్ గా వస్తున్న 'అగ్నివర్షం'

By Srikanya

పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్ ‌లో నిర్మితమైన 'అగ్నివర్షం' సినిమాలో నాగార్జున గారి పాత్ర హైలైట్‌గా వుంటుంది అంటున్నారు సమర్పకుడు తైలం నాగవర్మ. నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఓ బాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులోకి 'అగ్నివర్షం' పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు నిర్మాత ఆర్‌.హరి. అర్జున్‌ సజనాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్‌, జాకీష్రాఫ్‌, మిలింద్‌సోమన్‌, రవీనాటాండన్‌, దీప్తి భట్నాగర్‌, సోనాలి కులకర్ణిలు ముఖ్యతారలుగా నటించగా నృత్య దర్శకుడు ప్రభుదేవా ఓ విభిన్నమైన పాత్రను పోషించారు. ఇటీవల చెన్నెయ్‌లో సినీ, రాజకీయ ప్రముఖల సమక్షంలో ఈ చిత్రం పాటల రికార్డింగ్‌ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ "ప్రఖ్యాత రచయిత, నటుడు గిరీష్‌ కర్నాడ్‌ రచించిన ఓ ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.పీరియాడికల్‌ బ్యాక్ ‌డ్రాప్‌ లో నిర్మితమైన ఈ సినిమాలో నాగార్జున గారి పాత్ర హైలైట్ ‌గా వుంటుంది' అన్నారు. గ్రాఫిక్స్‌ ప్రాధాన్యత గల ఈ చిత్రం కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుందని చిత్ర సమర్పకుడు తైలం నాగవర్మ తెలియజేశారు. ఈ చిత్రానికి పాటలు: వనమాలి, సంగీతం: సందేశ్‌ కౌడిల్య అందించారు. ఇక నాగార్జున ప్రస్తుతం వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X