అవి రూమర్స్..నమ్మద్దు:నాగార్జున
ఈ చిత్రంలో నేను గెస్ట్ పాత్ర చేశాననే వార్త ప్రచారంలో ఉంది. సినిమా మొత్తం మీద నేను కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమే అని కూడా అనుకుంటున్నారు. కానీ నేను కనిపించనిది 30 నిమిషాలు మాత్రమే. మిగతా సినిమా మొత్తం ఉంటాను. ఇంటర్వెల్‌కి 30, 40 నిమిషాల ముందు నా పాత్ర ఎంటర్ అవుతుంది...అంటూ నాగార్జున వివరించారు. ఆయన తాజా చిత్రం రాజన్న లో ఆయన పాత్ర సినిమాలో కేవలం అరగంట మాత్రమే ఉంటుందని రూమర్స్ ప్రచారం కావటంతో ఆయన ఇలా స్పందించారు. అలాగే ఆ పాత్ర ముప్పై నిముషాల తర్వాత వచ్చినా దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్తూ..నా పాత్ర వచ్చేటంత వరకు గ్రామ ప్రజలు.. తమకోసం రాజన్న వస్తాడు.. తమ జీవితాలకు మంచి చేస్తాడు అంటూ రాజన్న గురించే మాట్లాడతారు.
ఆ రకంగా నా పాత్రకు సంబంధించిన డిస్క్రిన్షన్ ఉంటుంది. వాస్తవానికి రాజన్న పాత్రలో నన్ను నేను తెర మీద ఎప్పుడెప్పుడు చూసుకుందామా? అన్నంత ఎక్సయిటింగ్‌గా ఈ సినిమా చేశాను అన్నారు. ఇక ఈ చిత్రం మ్యూజికల్ ఫీస్ట్ అని చెప్తూ...'రాజన్న' సినిమాని అందరం ఎంతో ఎక్సయిట్‌మెంట్‌తో చేశాం. ఈ సినిమా చేయడానికి చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నాటి తరం కథ అయినా నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఇదొక మ్యూజికల్ ఫీస్ట్. కీరవాణిగారు చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం. అందుకే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ప్రత్యేకంగా సీడీ రూపంలో విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











