twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ, వెంకటేశ్ నాకంటే చిన్నవాళ్లు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇవాళ తెలుగులో అందరికంటే ఎక్కువ వయసు స్టార్‌ని నేనే. బాలకృష్ణ, వెంకటేశ్ నాకంటే చిన్నవాళ్లు. మిగతా భాషలతో పోలిస్తే 50 ఏళ్ల వయసు నుంచి టీనేజ్ వయసు దాకా హీరోలున్న ఏకైక చిత్రసీమ తెలుగే అన్నారు నాగార్జున. అలాగే ఇవాళ ప్రేక్షకుల్లో 75 శాతం మంది 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కుర్రాళ్లే. వాళ్లను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తియ్యాలి. ఇవాళ కమర్షియల్ సినిమాలే సేఫ్ జోన్. అయితే 'గీతాంజలి', 'రాజన్న' వంటి సినిమాల వల్ల లాంగ్ కెరీర్ ఉంటుంది. అలాంటివీ చేస్తుండాలి అన్నారు. నాగార్జున తాజా చిత్రం ఢమరుకం విడుదల సందర్భంగా మీడియాతో నాగ్ మాట్లాడారు.

    'డమరుకం' గురించి చెపుతూ...శ్రీనివాస్ రెడ్డి చెప్పిన కథ వినగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అయితే దీన్ని తెరకెక్కించాలంటే భారీ ఖర్చవుతుంది కదా అని సందేహపడ్డా. కానీ ఆర్.ఆర్. మూవీస్ వెంకట్ దేనికీ వెనుకాడకుండా ఓ గొప్ప సినిమా తియ్యాలనే ఒకే లక్ష్యంతో దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. ఆయన గట్స్‌కి మెచ్చుకోవాల్సిందే. ఆయనతో మళ్లీ మళ్లీ చెయ్యాలనుకుంటున్నా. 'మగధీర'తో పోలిస్తే 'ఈగ'లో కంప్యూటర్ గ్రాఫిక్స్ మరింత నాణ్యతతో ఉంటాయి. అయితే అతి పెద్ద స్థాయిలో కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ఉపయోగించిన తొలి తెలుగు సినిమా 'డమరుకం' అనేది నా అభిప్రాయం అన్నారు.

    అలాగే చిత్రం హైలెట్స్ లో దేవిశ్రీ మ్యూజిక్ మరో ఎస్సెట్ అంటూ...దేవీ ఈ సినిమా చూస్తూ బాగా ఇన్‌స్పైర్ అయ్యాడు. 'ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదు' అని చెప్పాడు. ఆ ఇన్‌స్పిరేషన్‌తో అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇప్పుడున్న దర్శకుల్లో ఎవరికీ తీసిపోడు శ్రీనివాసరెడ్డి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతని విజన్ చూసి ముచ్చటేసింది. ఆయన తీసిన 'యమగోల.. మళ్లీ మొదలైంది' చూశా. తక్కువ బడ్జెట్‌లోనే అంత బాగా తీస్తే, భారీ బడ్జెట్‌తో 'డమరుకం'ను ఇంకెంత బాగా తీసుంటాడో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

    తన తదుపరి చిత్రాలు గురించి చెప్తూ....దశరథ్‌తో సినిమా నవంబర్‌తో పూర్తవుతుంది. దీని టైటిల్ 'లవ్‌స్టోరీ' కాదు. 'రొటీన్ లవ్‌స్టోరి' అనే సినిమా వస్తుండటంతో ఆ టైటిల్ ఎలా పెడతాం? వీరభద్రమ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మించే సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో మొదలవుతుంది. ఇందులో పేరుకి నాది డాన్ కేరక్టర్ అయినా 'హలో బ్రదర్' తరహాలో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్. 2013 మార్చిలో విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుంది. ఇందులో నాన్న, నేను, నాగచైతన్య కలిసి నటించబోతున్నాం. ఆ తర్వాత బెల్లంకొండ సురేశ్ బేనర్‌లో ఓ సినిమా, దుర్గా ఆర్ట్స్‌లో మరో సినిమా చేస్తాను. జయ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చెయ్యాలనుకుంటున్నా. ఆమె ఇంకా కథ చెప్పలేదు అన్నారు.

    English summary
    Nagarjuna says that he is the aged star in tollywood. His latest Dhamarukam movie is expected to release on october 19th. Anushka paired up with Nagarjuna and music was scored by Devi Sri Prasad. This is a socio fantasy film and the makers are not compromising on the quality of visual effects. RR Movie Makers Venkat is the producer and Srinivasa Reddy is the director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X