'ఈగ' ను మించి ఉంటుందంటూ నాగార్జున.. కాంట్రావర్శీ
హైదరాబాద్: "డమరుకం చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతం. 'ఈగ' స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని మించి 'డమరుకం' ఉంటుంది'' అని చెప్పారు అక్కినేని నాగార్జున. ఆయన, అనుష్క జంటగా రూపొందిన 'డమరుకం' ఆడియో ఫంక్షన్ లో నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కాకముందే ఇలా రాజమౌళి సూపర్ హిట్ చిత్రం 'ఈగ' తో పోల్చటం చాలా మంది రాజమౌళి అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ విషయమై సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి.
నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'. ఈ చిత్రం ఆడియో విడుదలై మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రానికి ఓ రేంజిలో బిజినెస్ కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఓవర్ సీస్ రైట్స్ ని హరి వెంకటేశ్వర ఫిల్మ్స్ వారు తీసుకున్నారు. నాగార్జున తొలి సోషియో ఫాంటసీ చిత్రం కావటం,వరస విజయాలతో దూసుకు పోతున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మాత కావంట సినిమాకు డిమాండ్ తెచ్చి పెట్టింది. అక్టోబర్ 19 న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రం గురించి దర్సకుడు మాట్లాడుతూ.. ''నాగార్జున పాత్ర విభిన్నమైన రీతిలో ఉంటుంది. ఆయన తొలిసారి సోషియో ఫాంటసీ తరహా చిత్రంలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా గ్రాఫిక్స్ ఉంటాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నాము''అని ధర్శకుడు తెలిపారు. ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు.
ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్ నిర్మాత. ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, దేవన్, అవినాష్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, రఘుబాబు, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











