twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేం సోంబేరులమా? సినిమాలు తీయడం రాదా?.... ‘రంగస్థలం’ కంటే ‘గూఢచారి’ పెద్ద హిట్: నాగార్జున

    By Bojja Kumar
    |

    Recommended Video

    Goodachari Movie Success Meet

    అడవి శేష్, శోభిత ధూలిపాళ హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గూఢచారి' బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మూవీ సక్సెస్ మీట్‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ పరంగం చూస్తే గూఢచారి.. రంగస్థలం కంటే పెద్ద హిట్ అని, సినిమా కలెక్షన్స్ కంటే ఆడియన్స్‌లో ఎంత ఇంపాక్ట్ కలిగించిందనేదే ముఖ్యమన్నారు.

    మేం అంత సోంబేరులమా? సినిమాలు తీయడం రాదా? అనిపించింది

    మేం అంత సోంబేరులమా? సినిమాలు తీయడం రాదా? అనిపించింది

    అందరూ ఇన్‌క్రెడిబుల్‌ వర్క్‌ చేశారు. త్వరలోన అందరి పేర్లు అన్ని సినిమాల్లో కనపడతాయి. అందరూ న్యూ జనరేషన్‌ యాక్టర్స్‌, టెక్నీషియన్స్‌. మీరందరూ తెలుగు సినిమా ఫ్యూచర్‌. మీతో పాటు ట్రావెల్‌ చేయాలనుకుంటున్నాను. లేకుంటే నేను వెనుకబడిపోతాను. సినిమా చూస్తున్నంతసేపు ఎలా చేశారో చూశాను. సినిమా బడ్జెట్‌ గురించి తెలుసుకుని.. ఎలా సాధ్యమైందని ఆలోచించాను. ఇప్పటి వరకు మేం చేస్తున్న సినిమాలను చూసి మేం అంత సోంబేరులా, బద్దకస్తుల, సినిమా తీయడం మాకు తెలియదా? అని మాకు అనిపించింది.

    నాకు తెలియలేదు, సిగ్గేసింది

    నాకు తెలియలేదు, సిగ్గేసింది

    ‘గూఢచారి' సినిమాలో చాలా లొకేషన్లు కొత్తగా చూపించారు. 17 రోజులు అన్నపూర్ణ స్టూడియోలో చేశారట. నాకు తెలియలేదు. ఎక్కడ తీశారో కూడా గుర్తుపట్టలేక పోయాను. సిగ్గేసింది. నాన్నగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు.. అని నాగార్జున అన్నారు.

     చిన్నతనంలో అక్కడ నాన్నకు తెలియకుండా బీర్లు కొట్టేవాడిని

    చిన్నతనంలో అక్కడ నాన్నకు తెలియకుండా బీర్లు కొట్టేవాడిని

    అన్నపూర్ణ స్టూడియోను ‘గూఢచారి' టీం వాడినట్లు ఎవరూ వాడి ఉండరు. చిన్నతనంలో నాన్నకు తెలియకుండా ఫారెస్టులా ఉండే ప్రాంతంలో చిన్న బీర్ బాటిల్ తీసుకెళ్లి తాగేవాడిని. అంత వరకు తెలుసు. ఇపుడు అక్కడికెళ్లి తీశారట. చాలా లొకేషన్లు కొత్తగా ఉన్నాయి.

    స్టోరీ, రైటింగ్ బావుంది

    స్టోరీ, రైటింగ్ బావుంది


    స్టోరీ, రైటింగ్ అంతా బావుంది. ఒక సెన్సబుల్ సినిమాను కమర్షియల్ గా తీయడం చాలా కష్టం. కానీ ఈ చిత్రం విషయంలో దర్శకుడు, రైటర్స్ పని తీరు చాలా బావుంది అని నాగార్జున ప్రశంసించారు.

    ఈ ఏడాది ఈ మూడు సినిమాలే

    ఈ ఏడాది ఈ మూడు సినిమాలే

    సినిమాలు ఊరికే ఆడవు. ఈ సంవత్సరం అంతా తిప్పితిప్పి కొడితే మూడు సినిమాలు ఆడాయి. మహానటి, రంగస్థలం, గూఢచారి. నాకు తెలిసి కరెక్టుగా ఆడిన, డబ్బులు చేసుకున్న మూడు సినిమాలు ఇవే.

    గూఢచారి ఆ రెండింటి కంటే హిట్

    గూఢచారి ఆ రెండింటి కంటే హిట్

    నేను ‘రంగస్థలం', ‘మహానటి' సినిమాలను తక్కువ చేసి మాట్లాడటం లేదు.... మీకున్న బడ్జెట్, లిమిటేషన్స్ తో వాటన్నింటినీ ఓవర్ షాడో చేశారు. సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది ముఖ్యం కాదు. ఆడియన్‌కు ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది. భవిష్యత్‍‌లో వారి ఆలోచనలో ఎంత మార్పు తెచ్చింది అనేదే ముఖ్యం.

    కథ విన్నపుడు వర్కౌట్ అవుతుందనుకోలేదు

    కథ విన్నపుడు వర్కౌట్ అవుతుందనుకోలేదు


    నాకు ఈ కథ గురించి చెప్పినపుడు నేను అంతగా నమ్మలేదు. తెలుగులో స్పై ఫిల్మ్ ఏం ఆడుతుంది అనుకున్నాను. వీళ్లేం తీస్తారు? మణిరత్నం బాంబే సినిమా కన్నా ఏం చేస్తారు అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత ఫెంటాస్టిక్ అనిపించింది.

    కొత్త దర్శకులకు స్పూర్తిగా నిలవడం ఖాయం

    కొత్త దర్శకులకు స్పూర్తిగా నిలవడం ఖాయం

    అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ‘శివ' వచ్చినపుడు కొత్త డైరెక్టర్లకు ఎలా స్పూర్తినిచ్చిందో... ‘గూఢచారి' కూడా కొత్త డైరెక్టర్లకు స్పూర్తిగా నిలుస్తుందని, వారిలో కొత్త థాట్స్ రావడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను.. అని నాగార్జున తెలిపారు.

    English summary
    Akkineni Nagarjuna comments on Rangasthalam movie at Goodachari Successmeet. Goodachari Movie Success Meet Function held at Hyderabad. Akkineni Nagarjuna, Adivi Sesh, Supriya Yarlagadda, Madhu Shalini, Sashi Kiran Tikka, Ahishek Nama, Anil Sunkara, Abburi Ravi, Rakesh Varre, Sricharan Pakala, Shaneil Deo, Ravi Prakash at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X