వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. థియేటర్స్ లోనే విడుదల
టాలీవుడ్ నవ మన్మథుడు అక్కినేని నాగార్జున నెక్స్ట్ వైల్డ్ డాగ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆర్మీ ఆపరేషన్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మొదట్లో పోస్టర్స్ తోనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. బిగ్ బాస్ లో ఉండగా ఈ సినిమా షూటింగ్ కోసం నాగ్ హోస్ట్ బాధ్యత నుంచి కొంత బ్రేక్ తీసుకొని అప్పుడు సమంతను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.
ట్రెడిషినల్ ప్లస్ గ్లామరస్ లుక్స్ తో డోస్ పెంచిన రత్తాలు
అప్పుడే సినిమా పేరు బాగా వైరల్ అయ్యింది. ఇక వైల్డ్ డాగ్ ను ఇంకాస్త ప్రమోట్ చేస్తే క్లిక్కయ్యే అవకాశం ఉంటుందని నాగార్జున రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమాను మొదట ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఎందుకంటే జనాలు థియేటర్స్ వరకు రావడం కష్టమేనని, వచ్చిన ఓటీటీ ఆఫర్స్ కు అప్పట్లో టెంప్ట్ కావాల్సి వచ్చింది. ఇక నెట్ ఫ్లిక్స్ అయితే ఒక్కసారిగా 27కోట్లతో డీల్ ను క్లోజ్ చేసిందని కూడా టాక్ కూడా వచ్చింది.

అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ లో ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్న మాట వాస్తవేమనని వివరణ ఇచ్చింది. నాగార్జున మాట్లాడుతూ సంక్రాంతికి వచ్చిన క్రాక్, మొన్న వచ్చిన ఉప్పెన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. కంటెంట్ బావుంటే జనాలు థియేటర్స్ వరకు వస్తారని అర్ధమయ్యింది. అందుకే మళ్ళీ ఆ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకొని థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైనట్లు నాగార్జున చెప్పారు. ఏప్రిల్ 2న సినిమా థియేటర్స్ లో విడుదల అవుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications











