ఆ హీరోలు చేసేది తప్పు...నాగ్
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలందరూ రెండేళ్ళకో సినిమా చేయటంతో పరిశ్రమలో పెద్ద సినిమాలు అనేవి లేక అన్నిరకాలుగా ఇబ్బంది పడుతోంది. ఈ విషయంపై సీనియర్ హీరో నాగార్జున స్పందిచారు. కొంతమంది యువ హీరోలు తక్కువగా చిత్రాలు చేయడంపై మీ ఫీలింగ్ ఏమిటి అని మీడియా వారు ప్రశ్నించినప్పుడు "అలా చేయటం చాలా తప్పు. మనిషి అనేవాడు ఖాళీగా ఉండకూడదు. ఎనర్జీని ఏదోవిధంగా ఉపయోగించాలి. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. నేను అలా ఉండను. ఏదో పని చేస్తూనే ఉంటాను. జూనియర్స్ కొంచెం కథలపై కుస్తీపడాలి. వచ్చిన అవకాశాన్నిఉపయోగించుకోవాలి అంటూ కాస్త ఘాటుగానే చెప్పారు".
అంతేగాక తన కుమారుడు అలా చేయటానికి ఇష్టపడను అని...నా అభిప్రాయం ప్రకారం నాగ చైతన్య సంవత్సరానికి ఖచ్చితంగా మూడు సినిమాలు చెయ్యాలి. నటనను వృత్తిగా స్వీకరించాక వెనుకాడకూడదు. నాకంటే నా వయస్సుకి ఇమేజ్ కి తగిన కథలు దొరకడం కష్టం. తనకు ఆ ఇబ్బంది లేదు. తను కష్టపడాలి. సంక్రాంతికి, దసరా, దీపావళికి ఒకటి చొప్పున చేయాలి అన్నారు. నాగార్జున సూచన కాస్త యంగ్ హీరోలు పరిశీలిస్తే మంచి ఫలితాలు వస్తాయనటంలో సందేహం లేదు. ప్రస్తుతం నాగార్జున మరో కొత్త సినిమా కమిట్ అయ్యారు. ఈ నెల ఇరవై నాలుగు నుంచి గుంటూరులో ఆ చిత్రం షూటింగ్ జరుగుతుంది.


Click it and Unblock the Notifications