'ఓయ్' గురించి నాగార్జున....
తాను నటించిన 'ఓయ్' చిత్రాన్ని నాగార్జున చూసి గీతాంజలితో పోలుస్తున్నారని ఇండస్ట్రీలో చాలామంది తనకు తెలియజేసినట్లు హీరో సిద్దార్థ చెప్పారు.దాంతో నాగార్జున అన్నమాటకు మళ్లీ "ఓయ్" సినిమాను చూశానని సిద్ధార్థ వెల్లడించారు. గీతాంజలికి, ఓయ్ కి ఒక విషయంలో పోలిక ఉందని నాగార్జున తనతో చెప్పారని సిద్ధార్థ తెలిపారు. అదేమిటంటే..? గీతాంజలి గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత అంతా ప్లాప్ అన్నారు. ఆ తర్వాత పికప్ అయి రికార్డు సృష్టించింది. అయితే "ఓయ్" చిత్రానికి ఓపెనింగ్సే బ్రహ్మాండంగా ఉన్నాయని, సినిమా బాగుందనే టాక్ వచ్చిందని నాగార్జున ఓయ్ హీరోతో చెప్పినట్లు సిద్ధార్థ వెల్లడించారు. ఇక "ఓయ్" చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని సిద్ధార్థ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక హీరోయిన్ కి రోగం ఉండటం దగ్గర, మరి కొన్ని సన్నివేసాలు లోను ఈ రెండు చిత్రాలకు పోలిక ఉందని మొదిటి షో కే టాక్ వచ్చింది. అయతే ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగా డల్ గా ఉండటం తో జనాలకు ఎక్కటం లేదు.
ఎ మిలియనీర్ ఫస్ట్ లవ్ అనే కొరియా చిత్రం ఆధారం గా వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ లోని కామెడీ ని ప్రక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సునీల్ కామెడీ మాత్రం బోర్ ఫీల్ ఔతున్నట్లు చెప్తున్నారు. అయితే చిత్రం మాత్రం టెక్నికల్ గా బాగుందని అన్ని వర్గాలు నుండి వినపడుతోంది. అందులోను అంజలి పాపగా పాపులర్ ఐన షామిలి యౌక్త వయస్సులోకి వచ్చిన తర్వాతా చేసిన మొదటి ఫిలిం కావటం కలిసి వస్తోంది. మరో ప్రక్క 'ఓయ్' చిత్రం సక్సెస్ మీట్ శుక్రవారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ చిత్రం మొదటి వారం కోటిన్నర రూపాయలు వసూలు చేసిందని నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డి.సురేష్‌బాబు చెప్పారు. విభిన్నమైన కథను ఎన్నుకుని రిస్క్ చేసి నిర్మించిన ఈ చిత్రం విజయవంతమయినందుకు ఆనందంగా ఉందని హీరో సిద్దార్థ చెప్పారు. ఒక మంచి సినిమా తీసినందుకు సంతృప్తిగా ఉందని నిర్మాత దానయ్య చెప్పారు. ఇలా ఈ చిత్రం ని పబ్లిసిటీ చేస్తూ డ్రాప్ అవకుండా చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











