విని నిజంగా షాక్ అయ్యా: నాగార్జున
"ఇక 'అమెరికాలో లాస్ వెగాస్ వెళ్లినప్పుడు కాసినోలు చూశాను. ఆ వాతావరణం ఎలా ఉంటుందా అని వెళ్లి చూశానంతే. తప్పితే గ్యాంబ్లింగ్ అంటే నాకు ఇష్టం లేదు. మీకో విషయం తెలుసో.. లేదో..పేకాట కూడా నేను ఆడను. కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇలా జూదానికి తగలేయడమంటే నాకు ఇష్టముండదు" అని చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం నాగార్జున భాయ్ చిత్రాన్ని ఓకే చేసారు. ఈ చిత్రాన్ని వీరభద్ర చౌదరి డైరక్ట్ చేయనున్నారు. అహనా పెళ్లంట,పూల రంగడు చిత్రాలతో కామీడి చిత్రాలు తీసి హిట్ కొట్టగలడనే పేరు తెచ్చుకున్న వీరభద్రం ఈ చిత్రంతో హాట్రిక్ హిట్ కొడతానని నమ్మకంగా ఉన్నారు. రిలియెన్స్ వారు ఈ చిత్రాన్ని సమర్పిస్తూండగా నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణపై తీయనున్నట్లు వినికిడి.
వీటితో పాటు నాగార్జున ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'షిరిడి సాయి' చిత్రంలో నటిస్తున్నాడు. ఇంతకు ముందు భక్తుడిగా అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన నాగ్, షిరిడి సాయి చిత్రంలో తొలిసారి దేవుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే తన తండ్రి నాగేశ్వరరావు,తన కుమారుడు నాగచైతన్యలతో కలిసి త్రయం అనే చిత్రం చేస్తున్నారు. ఇష్క్ దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
