స్నేహితుడి మృతితో నాగార్జున ఆవేదన.. 33 ఏళ్లుగా నాతో!
టాలీవడ్ ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత అయిన డి శివప్రసాద్ రెడ్డి నేడు మృతి చెందిన సంగతి తెలిసిందే. శివప్రసాద్ రెడ్డి అక్కినేని కుటుంబానికి సన్నిహితుడుగా పలు చిత్రాలు నిర్మించారు. శివ ప్రసాద్ రెడ్డి అత్యధిక చిత్రాలు నాగార్జున తోనే నిర్మించారు. శివప్రసాద్ రెడ్డి మృతి పట్ల తాజాగా నాగార్జున స్పందించారు. ప్రియమైన స్నేహితుడిని కోల్పోయా అంటూ ట్వీట్ చేశారు.

నాగార్జున ఆవేదన
శివ ప్రసాద్ రెడ్డి మృతిపై నాగార్జున ట్విట్టర్ లో స్పందించాడు. నేడు నేను ప్రియమైన స్నేహితుడిని కోల్పాయా అంటూ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. 1987 లో విక్కీ దాదా చిత్రంతో నాగార్జున, శివప్రసాద్ రెడ్డి స్నేహం మొదలైంది. ఆ తరువాత శివప్రసాద్ రెడ్డి నిర్మాణంలో నాగార్జున వరుస చిత్రాల్లో నటించారు.
33 ఏళ్లుగా నాతోనే
శివప్రసాద్ రెడ్డితో తన అనుభందం 33 ఏళ్లుగా కొనసాగుతోందని నాగార్జున గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం విక్కీ దాదా. విక్కీ దాదా చిత్రం తరువాత శివప్రసాద్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో ముఠా మేస్త్రి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తరువాత శివప్రసాద్ నిర్మించిన చిత్రాలన్నీ అక్కినేని కుటుంబంతోనే కావడం విశేషం.

మంచి విజయాలు
శివప్రసాద్ రెడ్డి, నాగార్జున కాంబోలో వచ్చిన విక్కీ దాదా, నేనున్నాను, కింగ్, అల్లరి అల్లుడు వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. అక్కినేని నాగచైతన్యతో శివప్రసాద్ రెడ్డి దడ చిత్రాన్ని నిర్మించారు. ఈయన నిర్మించిన చివరి చిత్రం నాగ్, నయనతార కాంబినేషన్ లో వచ్చిన గ్రీకు వీరుడు.

శనివారం ఉదయం
శనివారం ఉదయం శివప్రసాద్ రెడ్డి అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గుండె కొంత కాలంగా శివప్రసాద్ రెడ్డి గుండె సంబంధిత వ్యాధితో భాదపడుతున్నారు. శివప్రసాద్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని నాగార్జున ప్రార్థించారు.


Click it and Unblock the Notifications











