మహేష్, మణిరత్నంతో సినిమా... వివరాలు వెల్లడించిన నాగార్జున
హైదరాబాద్: కింగ్ నాగార్జున, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయమై అక్కినేని నాగార్జున తొలిసారిగా స్పందించారు. మణిరత్నం సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించబోతున్నట్లు వెల్లడించారు.
'అవును. మహేష్ బాబుతో కలిసి మణిరత్నం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులోనే తెరకెక్కుతోంది. మణి రత్నం నాకు 40 నిమిషాల స్టోరీ చెప్పారు. అది విన్న తర్వాత నేను క్లీన్ బోల్డ్ అయ్యాను. చాలా బాగుంది స్టోరీ. అందుకే వెంటనే ఓకే చెప్పేసాను' అని నాగార్జున తెలిపారు.

'వాస్తవానికి మణి రత్నం అప్పట్లోనే 'గీతాంజలి' తర్వాత నాతో మరో తెలుగు సినిమా చేయాలనుకున్నారు. కానీ వీలు కాలేదు' అని నాగార్జున తెలిపారు. 'మహేష్ బాబు, నేను తొలిసారిగా కలిసి నటిస్తున్నాము. ఆడియన్స్ కొత్త కాంబినేషన్స్ కోరుకుంటున్నారు' అన్నారు.
ప్రస్తుతం నా ఫోకస్ అంతా.....మై ఫాదర్, మైసన్, నేను కలిసి నటించిన 'మనం' చిత్రం విడుదలపైనే ఉందని నాగార్జున వెల్లడించారు. నాన్న గారు నటించిన చివరి చిత్రం కావడంతో 'మనం' చిత్రంపై అభిమానులు ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఈచిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని నాగార్జున చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











