పెళ్లామా?.. కోడలా?: తేల్చుకోలేకపోతున్న నాగ్.. ఆరోజు ఏం చేస్తారో?
పాపం నాగార్జునకు పెద్ద కష్టమే వచ్చి పడింది. క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని తీసుకొస్తే.. ఆయన్ను మాత్రం పెద్ద డైలామాలోకి నెట్టింది. ఓవైపు భార్య.. మరోవైపు కోడలు.. ఈ ఇద్దరిలో ఇప్పుడు ఎవరికి తొలి ప్రియారిటీ ఇవ్వాలన్నది నాగ్ తేల్చుకోలేకపోతున్నారు. ఇంతకీ ఏంటా కహానీ..
Recommended Video


సమంత క్రిస్మస్ పార్టీ:
ఈ ఏడాదే అక్కినేని ఇంటికి కోడలుగా వచ్చిన సమంత.. ఈసారి క్రిస్మస్ వేడుకలను స్పెషల్ గా ప్లాన్ చేశారట. తను క్రిస్టియన్ కావడంతో అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారట. ఇదే విషయం నాగ్ కు కబురుపెడితే.. సంతోషించాల్సిందిపోయి ఆయన తల పట్టుకున్నారట.

తలపట్టుకున్న నాగ్?:
సమంత తనను పార్టీకి ఆహ్వానించిన రోజే.. అమల కూడా క్రిస్మస్ పార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారట. కుటుంబ సభ్యులు, స్నేహితులను పిలిచి గ్రాండ్‌గా పార్టీ చేసే ఏర్పాట్లలో ఉన్నారట. దీంతో అమల.. సమంతల్లో ఎవరి పార్టీకి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారట.

డైలామాలో:
అటు అమలను కాదనలేక.. ఇటు సమంతను కాదనలేక.. ఈ రెండు పార్టీలను ఎలా మేనేజ్ చేయాలా? అని నాగ్ ఆలోచిస్తున్నారట. అయితే ఇద్దరూ హైదరబాద్ లోనే పార్టీ చేసుకుంటున్నారా?.. వేర్వేరు ప్రాంతాల్లో ప్లాన్ చేసుకుంటున్నారా? అన్న దానిపై క్లారిటీ లేదు.

ఏం చేస్తారో?
ఒకవేళ అమల.. సమంత.. ఇద్దరూ హైదరాబాద్ లోనే క్రిస్మస్ పార్టీ ప్లాన్ చేసుకుంటే.. నాగార్జునకు పెద్దగా కష్టపడే పని ఉండకపోవచ్చు. ఎలాగోలా రెండు పార్టీలను మేనేజ్ చేయవచ్చు. చూడాలి మరి.. ఆరోజు నాగ్ ఏం చేయబోతున్నారో!


Click it and Unblock the Notifications











