twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దసరా రేసులో నాగ్ ‘డమరుకం’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగార్జున హీరోగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డమరుకం'. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ చిత్రంలో దాదాపు గంటసేపు గ్రాఫిక్స్ ఉంటాయని, తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని విధంగా వాటిని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఫస్టాఫ్ మొత్తం కామిడీగా సాగినా,ఇంటర్వెల్ అదిరిపోతుందని చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గతంలో రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. డమరుకం చిత్రంలో శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది.

    ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు. వెంకట్‌ నిర్మాత. ప్రకాష్‌రాజ్‌, గణేష్‌ వెంకట్రామన్‌, దేవన్‌, అవినాష్‌, బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, రఘుబాబు, ప్రగతి తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహనిర్మాత: వి.సురేష్‌ రెడ్డి, కూర్పు: గౌతమ్‌రాజు, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

    English summary
    Nagarjuna’s socio fantasy drama ‘Damarukam’ is going to hit the screens for Dussehra, as per the latest news doing the rounds in Filmnagar. The movie is currently in post production mode and extensive special effects work is causing delays. Srinivasa Reddy has directed this movie while Dr. Venkat of R.R.Movie Makers is the producer. Anushka is the heroine in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X