నాగార్జున 'ఢమరకం' రిలీజ్ డేట్ ఖరారు

By Srikanya

నాగార్జున హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్‌పై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'డమరుకం". భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ గా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రియల్ 6,2012 న విడుదల కానుందని విశ్వసనీయ సమాచారం. ఆ రోజు గుడ్ ప్రైడే కావటంతో హ్యాలీడే శెలవు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం పై నాగార్జున బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెప్తూ..'సోషియో ఫాంటసీ చిత్రం చేయాలన్న నా కోరిక ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ద్వారా నెరవేరుతోంది. శ్రీనివాసరెడ్డి చెప్పిన కథ బాగా నచ్చింది. ఇందులో నాలుగు రకాల గెటప్స్‌లో కనిపిస్తాను. నా పాత్ర వెస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడుతుంది. సరికొత్తగా, స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది" అన్నారు.

ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది.

ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది.నాగార్జున, అనుష్క, ప్రకాష్‌రాజ్, సోనూ సూద్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, అలీ, రఘుబాబు, ఎమ్మెస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: గౌతంరాజు, డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X