నాగార్జున నైజంకు హాట్సాఫ్ చెప్పేస్తున్నారు....!?
నాగార్జున, అనుష్క జంటగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం 'డమరుకం' షూటింగు ప్రస్తుతం హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. భారీ వ్యయంతో రూపొందుతున్నప్పటికీ ఈ చిత్రాన్ని లో-ప్రొఫైల్ లో ఉంచుతున్నారు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు ఇటీవలే కర్ణాటకలోని బదామీ, హంపీ ప్రాంతాలలో 15 రోజుల పాటు జరిగింది. ఫైట్ మాస్టర్ విజయన్ నేతృత్వంలో నాగార్జున, అనుష్క, ఇతర ప్రధాన తారాగణంపై ఇంటర్వెల్ ఎపిసోడ్ ను భారీ ఎత్తున షూట్ చేశారు. సోషియో ఫ్యాంటసీ చిత్రం కాబట్టి గ్రాఫిక్స్ ను ఎక్కువగా వాడుతున్నారని సమాచారం.
వివాద రహితుడిగా ఉండడం, ఉన్నదాంతో ఆనందగా గడిపేయడం తన గ్లామర్ సీక్రెట్స్ అని నాగార్జున తరచుగా చెబుతుంటారు. చెప్పినట్టుగానే కుళ్లు, కుతంత్రాలు లేకుండా నాగార్జున పీస్ ఫుల్ లైఫ్ గడుపుతుంటారు. తన తోటి హీరోల్లో ఏ ఇతర హీరోపై లేనన్ని గాసిప్స్ తనపై వచ్చినా కానీ నాగార్జున నవ్వి పారేశారే తప్ప పట్టించుకోలేదు. గాసిప్స్ అనేవి సెలబ్రిటీస్ కి కామన్ అని, దానిపై రాద్ధాంతం చేయడం అనవసరమని నాగార్జున అంటారు.
అయితే నెగెటివ్ న్యూస్ కంటే పాజిటివ్ న్యూస్ ని చదవడానికి, తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతానని ఇటీవలి కాలంలో దూకుడు అంత పెద్ద హిట్టవ్వడం తనికి ఆనందాన్ని కలిగించిందని నాగార్జున చెప్పారు. ఇతర హీరోల విజయంలో కూడా ఆనందాన్ని వెతుక్కునే నైజం ఎంతమందికి ఉంటుంది. తమపై ఏదైనా గాసిప్ వస్తే ఏదో ప్రపంచ విపత్తు వచ్చేసినట్టు నానా గోల చేసే వాళ్లున్న వారి మధ్య దానిని హుందాగా నవ్వి పారేసి తన పని తాను చూసుకునే హీరోలు ఎంత మంది ఉన్నారు. అందుకే నాగార్జున మెచ్యూరిటీకి ఎవరైనా సలాం చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











