చివరాఖరున నాగార్జున ‘డమరుకం’
అక్కినేని నాగార్జున నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ఏడు ఎకరాల్లో వేసిన సెట్ లో జరుగుతోంది. ఈ నెల 23వ తేదీలోగా సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం... చిన్న చిన్న సీన్లు మాత్రమే మిగిలి ఉన్నాయని, మరో వారం రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుందని అంటున్నారు. అనంతరం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకోనుంది.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్, విజువల్ గ్రాఫిక్స్ ముఖ్య భూమిక పోషించనున్నాయి. మంచి ఫలితాలు రాబట్టేందుకు నిర్మాతలు ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది.
డమరుకం సినిమా అనంతరం నాగార్జున 'షిరిడి సాయి'గా రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ....షిరిడి సాయి పాత్ర కోసం ఓ నకిలీ తెల్లగడ్డాన్ని వాడనున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











