‘డమరుకం’ సెన్సార్ పూర్తి
హైదరాబాద్: కింగ్ నాగర్జున తాజా సినిమా 'డమరుకం' సెన్సార్ కార్యక్రమాలను ఈ రోజు పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డువారు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రాన్ని 19న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఒక రోజు ఆలస్యంగా అక్టోబర్ 20న విడుదల చేసేందుకు రంగం సిద్ధమైందని వార్తలు వినిపించాయి. కానీ నాగార్జున స్పందిస్తూ సినిమా 19నే విడుదలవుతోందని స్పష్టం చేసారు.
నాగార్జున కెరీర్‌లోనే ఎక్కువ థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం గతంలో చూడని గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా చార్మి సక్కుబాయ్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
రూ. 40 కోట్ల భారీ వ్యయంతో నాగార్జున సినీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయినా....గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావడానికి సమయం ఎక్కువ తీసుకోవడంతో సినిమా లేటవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెలలో విడుదలకు సిద్ధమైంది.
అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్‌వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.


Click it and Unblock the Notifications











