నాగార్జున 'ఢమురకం' చిత్రం స్టోరీ పాయింట్ ఏమిటంటే..
నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో ప్రారభం అయిన ఢమురుకం చిత్రం సంక్రాంతి 2012 కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు.
రీసెంట్ గా డాన్ శీను వంటి హిట్ కొట్టిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనూష్క మరో సారి నాగార్జున సరసన చెయ్యనుంది. సోషియో ఫాంఠసీ గా రూపొందే ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. మరో ప్రముఖ దర్సకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెలంగాణా సాయుధ పోరాటం నేపధ్యంలో రాజన్న అనే చిత్రం కూడా నాగార్జున చేస్తున్నారు.
ఇక అనుష్క, నాగార్జున కాంబినేషన్ లో విడుదలైన రగడ చిత్రం టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ బాగున్నాయి. అలాగే రీసెంట్ గా విడుదలైన నాగార్జున కొత్త చిత్రం గగనం..మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ కనపడటం లేదు.


Click it and Unblock the Notifications











