రాత్రయితే సక్కుబాయి...: నాగార్జున
హైదరాబాద్: డమరుకం చిత్రంలో ఒక్కో మూడ్‌కు తగిన విధంగా ఒక్కో సాంగ్ ఉందని, ఉదయం వినడానికి శ్లోకం, కోపం వస్తే వినడానికి శివుని మీద కీర్తన, రొమాంటిక్ టైంలో వినడానికి నేస్తమా సాంగ్, రాత్రయితే వినడానికి సక్కుబాయి సాంగ్ బాగుందని అందుకే ఈ చిత్రం ఆడియో హిట్టయిందని నాగార్జున చెప్పుకొచ్చారు. డమరుకం ఆడియో విజయంలో భాగంగా ప్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.
ఈ చిత్రం విశేషాల గురించి నాగార్జున వెల్లడిస్తూ 'డమరుకం' చిత్రం షూటింగ్ గత సంవత్సరం డిసెంబర్ 25నే పూర్తయిందని, గ్రాఫిక్స్ వర్క్, సక్కుబాయి సాంగ్ తదితర కారణాల వల్ల సినిమా విడుదల 9 నెలలు ఆలస్యం అయిందని వెల్లడించారు. లేటయినప్పటికీ ఈనెల 19న సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోందన్నారు.
'రవి శంకర్ ఈచిత్రంలో ఓ అద్భుతమైన పాత్ర పోషించారు. ఆయన నటన చూస్తుంటే నాకు మాయా బజార్‌లో ఎస్వీఆర్ గుర్తుకు వచ్చారు. అదే విధంగా దర్శకుడిలో ఒక ఇవివి కనిపించారు. ఫైర్ ప్లే సంస్థ వారు గ్రాఫిక్స్ అద్భుతంగా చేసారు. ఫైర్ ప్లే ఇండియా వారిని అవతార్ ఆఫ్ ఇండియా అనవచ్చు. అంత బాగున్నాయి గ్రాఫిక్స్. విజయ్ ఫైట్స్ ఇరగదీసాడు. ఫైట్స్ చూస్తే నన్ను మన్మధుడు అనే అవకాశం మరోసారి వస్తుందని అనిపించింది' అని నాగార్జున వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ఇంకా చార్మి, శ్రీనివాసరెడ్డి, అచ్చిరెడ్డి, సురేష్ రెడ్డి, గౌతం రాజు, విలిగొండ శ్రీనివాస్, దయానంద్, రవిశంకర్, జొన్నవిత్తుల, రామజోగయ్య శాస్త్రి, ఫైర్ ప్లే గ్రాఫిక్స్ సనత్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్‌వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.


Click it and Unblock the Notifications











