నాగార్జున-దశరధ్ చిత్రం టైటిల్ ఖరారు
నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో గతంలో సంతోషం చిత్రం వచ్చి ఘన విజయం సాధించింది. మళ్లీ చిర కాలం గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి లవ్ స్టోరీ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ లో రాసారు. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. నయనతార గతంలో నాగార్జున తో బాస్ చిత్రం చేసింది. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో నాగార్జున నటించిన 'రగడ'కి తమన్ సంగీతం అందించారు.
నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. అలాగే బాస్ తర్వాత నాగార్జున,నయనతార కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. ఎంటర్టైన్మెంట్ తో కలసిన లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దనున్నారు. అలాగే నాగార్జున రెగ్యులర్ నిర్మాత డి.శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని తమ కామాక్షి బ్యానర్ పై నిర్మిస్తారు.
మొదట వెంకటేష్ కు అనుకున్న కథని నాగార్జునకి వినిపించగా ఓకే చేసాడని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. దానికి కారణం సింహా నిర్మాత అని చెప్తున్నారు. సింహా నిర్మాతతో దశరధ్ సినిమాకోస అడ్వాన్స్ తీసుకుని గత కొంత కాలంగా కథని వండుతున్నారు. అయితే దశరధ్ రెడీ చేసిన కథ నచ్చలేదని ,ఇప్పుడు ట్రెండ్ కామిడీ నడుస్తోంది కాబట్టి దూకుడులాంటి కథ చెప్పమనటంతో ఫీల్ గుడ్ స్టోరీ తయారుచేసుకున్న దశరధ్ డైలమోలో పడి నాగార్జునకి కథ చెప్పి ఒప్పించుకున్నాడని చెప్తున్నారు.
కేడీ, రగడ, దడ సినిమాలను నిర్మించిన కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. అయితే నాగార్జున వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో డేట్స్ ఇవ్వటానికి మరికొంత సమయం పట్టవచ్చని చెప్తున్నారు. ఇక వరస ప్లాపుల్లో ఉన్న దశరధ్ కి మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం మళ్లీ జీవం పోసి నిలబెట్టింది. ప్రస్తుతం నాగార్జున ...శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న డమురకం చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











