'స్పెషల్ ఛబ్బీస్' రీమేక్ విషయమై తేల్చిన నాగ్
దానికి నాగార్జున సమాధానమిస్తూ... ''ఈ వార్త ఎలా పుట్టిందో తెలీదు. నేనసలు ఆ సినిమా చూళ్లేదు. కానీ 'మీరు చేస్తే బాగుంటుంది' అని అందరూ చెబుతున్నారు. చూద్దాం.. నాకూ అలాగే అనిపిస్తే తప్పకుండా చేస్తా'' అన్నారు. ఈ చిత్రం నాగార్జునకి సూట్ అవుతుందని,డిగ్నిఫైడ్ గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.
'స్పెషల్ చబ్బీస్' చిత్రం యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు సమకూర్చారు. '1980వ దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సీబీఐ నుంచి వచ్చాం అంటూ నగల దుకాణాల్నీ, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల్నీ ఓ బృందం ఎలా దోచుకొందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది.
మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.


Click it and Unblock the Notifications












