జస్ట్ ఇంటర్వెల్ ముందు ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున..!

By Sindhu

అక్కినేని నాగార్జున నటిస్తున్న 'రాజన్న' చిత్రం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని డిసెంబరు 23న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా కథ 1960 లో తెలంగాణా ప్రాంతానికి చెందిన కథ. ఈ సినిమాకి సంభందించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 20నిమిషాలు, కాగా నాగార్జున పాత్ర ఎంట్రీ ఇంటర్వెల్ కి ముందు ఉంటుంది. ఈ సినిమాలో మల్లి పాత్ర పోషించే 'ఏనీ' ముఖ్య పాత్ర పోషిస్తుండగా సినిమా బాగా తీర్చి దిద్దారని సమాచారం.

రాజమౌళి యాక్షన్ పార్ట్ చిత్రీకరించిన ఈ చిత్రానికి, కీరవాణి అందించిన ఆడియో విడుదలై విశేష ఆదరణ పొందింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం. ఖచ్చితంగా రాజన్నతో నాగార్జున పెద్ద హిట్ కొడతాడని ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ నిజమైతే కనుక 'మాస్' తర్వాత అన్నీ ఓ మాదిరి సినిమాలే చేసిన నాగార్జునకి ఆకలి మొత్తం తీరిపోయినట్టే. వరుసగా చైతన్య కొట్టిన రెండు దెబ్బలకి కోలుకోని అక్కినేని అభిమానులకి మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చినట్టే. ఈచిత్రంలొ ఏవీ అనే పాప ముఖ్య పాత్ర పోషించగా, స్నేహ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ రచయిత రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X